సీఎంగా జగన్ ఉన్నపుడు ఢిల్లీ టూర్లకు విపరీతమైన హైప్ కల్పించేది బ్లూ మీడియా. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ లతో జగన్ భేటీల మీద భేటీలు అయ్యేవారు జగన్. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగనన్న పాటుపడుతున్నారనంటూ బ్లూ మీడియా ఊదరగొట్టేది. కట్ చేస్తే తన కేసుల గురించి మాట్లాడుకుని రిక్త హస్తాలతో జగన్ రాష్ట్రానికి తిరిగి వచ్చేవారు. అదంతా గతం. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారంటే ఏపీ ప్రజలకు ఏదో ఒక తీపి కబురు కేంద్రం చెబుతుంది అన్న పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తీపికబురు చెప్పారు.
ఏపీలో రైల్వే శాఖ రూ.73,743 కోట్ల పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతోందని రైల్వే శాఖ మంత్రి చెప్పిన విషయాన్ని చంద్రబాబు ప్రకటించారు. కొత్త రైల్వే జోన్ కు డిసెంబరులో పునాది రాయి పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ సంతృప్తికరంగా జరిగిందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, అందుకుగాను ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీకి వివరించానని చంద్రబాబు తెలిపారు.
ఏపీ ఆర్థిక భారానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చినందుకు, నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యానని, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ను ముందుకు తీసుకెళుతున్న ఆయనకు కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, జగన్ ల ఢిల్లీ టూర్ ల మధ్య తేడా ఇదే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.