కొద్ది రోజులుగా ఏపీని వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించడం లేదని, వరద బాధితులకు సాయం సరిగ్గా అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు నిర్లక్ష్యంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం పీకల్లోతు నీటిలో…కష్టాల్లో ఉన్న జనాన్ని పరామర్శించేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
ఇక, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వరద తగ్గుముఖం పట్టిన తర్వాత సీఎం జగన్ థూథూ మంత్రంగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ కు బాధ్యత లేదని, అందుకే పరామర్శించడంలో అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యత తీసుకునే వారికి ఎంతైనా పని ఉంటుందని, బాధ్యతారాహిత్యంగా ఉండేవారికి పని ఉండదని ఎద్దేవా చేశారు.
తాను సీఎంగా ఉన్నపుడు తుపాన్లు, వరదలు వస్తే పండగలు పబ్బాలు వదిలేసి మరీ జనం దగ్గరకు వెళ్లానని చంద్రబాబు గుర్తు చేశారు. తిత్లీ తుపాను సమయంలో మండలానికి ఒక ఐఏఎస్ అధికారి, మంత్రిని నియమించి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించానని చెప్పారు. హుద్ హుద్ తుపాను సమయంలో 10 రోజులు బస్ లో నే బస చేసి పరిస్థితులు చక్కబడ్డ తర్వాతే ఇంటికి వెళ్లానని చెప్పుకొచ్చారు.
గతంలో హైదరాదాబ్ లో వరదలొస్తే సచివాలయం పక్కనే ఉన్నప్పటికీ కావాలనే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్లి అక్కడే కూర్చొని పరిస్థితిని సమీక్షించానని గుర్తు చేసుకున్నారు. కావాలంటే సచివాలయం నుంచే తాను సమీక్ష జరపవచ్చని, కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించి ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేందుకు అక్కడకు స్వయంగా వెళ్లానని చెప్పారు.
ఇక, శ్రీకాకుళంలో 1999 సూపర్ సైక్లోన్ టైంలో…టీడీపీ కమిట్మెంట్ గురించి చెప్పారు. మన రాష్ట్రాన్ని తుపాను టచ్ చేసే అవకాశముందన్న ముందస్తు హెచ్చరికతో ఎన్నో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, బాధ్యత అంటే అలా ఉండాలని అన్నారు. కానీ, నేడు ఈ ముఖ్యమంత్రికి వరదలంటే లెక్కలేదని, పోలవరం, అమరావతిపై శ్రద్ధ లేదని, ఇటువంటి ప్రభుత్వం ఉండడం ఆంధ్రాప్రజల దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments 1