అక్కినేని నాగార్జున ఎవరో తెలియని వాళ్ళకి ఆయన్ని చూపించి తన వయసెంత అని అడిగితే.. 40- 45 మధ్య చెబుతారేమో. కానీ ఈ ఏడాది ఆగస్టులో ఆయనకు 65 ఏళ్లు పూర్తవుతాయంటే ఆశ్చర్యపోక మానరు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 40 ఏళ్ల ఘన ప్రస్థానం ఆయనది. తండ్రి అక్కినేని నాగేశ్వరావు లాగే ఆరోగ్యం, ఫిట్నెస్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ.. ఇప్పటికి తాను మన్మధుడినే అనిపించుకుంటున్నారు.
యువ హీరోలతో పోటీ పడే ఫిట్నెస్ ఆయనది. అయితే నాగ్ ఫిట్నెస్ చూసి ఆయన తిండి విషయంలో చాలా లిమిటేషన్లు పెట్టుకుంటారేమో అనిపిస్తుంది. కానీ అదేం లేదు అని.. తను శుభ్రంగా అన్ని తింటానని నాకు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. తాను మాంసాహారం, స్వీట్లు.. ఇలా అన్ని తింటానని, ఈ వయసులో కూడా అన్నిటిని అరిగించుకోవడానికి అవసరమైన మెటబాలిజం తనకు ఉందని నాకు చెప్పాడు. ఆ మెటబాలిజం అందించేది తన వర్కౌట్లే అని నాకు తెలిపాడు. పొద్దున లేస్తే గంటా రెండు గంటలు వర్కౌట్లు చేయకుండా తన రోజు మొదలు కాదని.. 35 ఏళ్లకు పైగా ఈ అలవాటు కొనసాగుతోందని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ దాని విడిచిపెట్టనని నాగ్ చెప్పాడు.
అలా వర్క్ఔట్ చేశాక ఏం తిన్నా ఇబ్బంది లేదని.. తన శుభ్రంగా అన్ని తింటానని నాగ్ చెప్పాడు. ఉదయం అన్ని రకాల టిఫిన్లు చేస్తానని.. మధ్యాహ్నం అన్ని రకాల కూరలు కలుపుకొని బ్రౌన్ రైస్ తో భోజనం చేస్తానని.. నాన్ వెజ్ కూడా బానే తింటానని నాగ్ వెల్లడించాడు. రాత్రి తాను స్వీట్ తినకుండా నిద్రపోనని.. అది ఎప్పటినుంచి ఉన్న అలవాటని అక్కినేని హీరో చెప్పాడు. వర్క్ ఔట్ చేస్తే అందరూ అన్ని తినొచ్చని. తాను ఇచ్చే సలహా అదేనని నాగ్ స్పష్టం చేశాడు.