ప్రముఖ నటి మరియు స్టార్ యాంకర్ ఝాన్సీ అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. అటు బుల్లితెర తో పాటు ఇటు వెండితెరపై కూడా ఝాన్సీ తనదైన ముద్ర వేశారు. 90వ దశకంలో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో ఝాన్సీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. సినీ నటుడు జోగి నాయుడును ప్రేమించి పెళ్లి చేసుకున్న ఝాన్సీ.. ఏడాది కూడా అతనితో కలిసి ఉండలేక పోయింది.
అభిప్రాయభేదాలతో జోగి నాయుడుకు విడాకులు ఇచ్చేసింది. భర్తతో విడిపోయే సమయానికి ఝాన్సీ కి ఒక కూతురు ఉంది. ఆమె పేరు ధన్య. ప్రస్తుతం ధన్య చాలా పెద్దదైంది. తన తల్లి బాటలోనే సినిమాల్లోకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇక తాజాగా ఝాన్సీ ఫస్ట్ టైమ్ తన కూతురు ధన్యతో కలిసి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కాకమ్మ కథలు అనే టాక్ షోకు హాజరైంది. హోస్ట్ గా వ్యవహరిస్తున్న తేజస్వి మదివాడ.. తల్లీకూతుళ్లను తన ప్రశ్నలతో ఓ ఆట ఆడేసుకుంది.
ఇదే ఈ టాక్ షో వేదికగా ధన్య తన మనసులో కోరికలను బయటపెట్టింది. తన ఏజ్ 22, హైట్ 5’9 అని తెలిపింది. న్యాచురల్ స్టార్ నాని తన ఫేవరెట్ హీరో అని, ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించడం తన డ్రీమ్ అని ధన్య చెప్పుకొచ్చింది. అలాగే తల్లితో తనకున్న అనుబంధం, చిన్నతనం నుంచి తాను పెరిగిన విధానంపై కూడా అనేక విషయాలు పంచుకుంది ధన్య.
ఇకపోతే ఇటీవలె ధన్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. చూడడానికి ఎంతో క్యూట్ గా, అందంగా ఉండే ధన్య అద్భుతమైన డ్యాన్స్ కూడా. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టే పోస్టులే ఇందుకు నిదర్శం. ఒక హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ధన్యలో ఉండటంతో.. ఆమె ఫిల్మ్ ఎంట్రీ కోసం ఝాన్సీ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
View this post on Instagram