కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్యా రజనీకాంత్ లు విడిపోతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రచారంపై వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. దీంతో, అది సోషల్ మీడియాలో మాత్రమే జరుగుతోన్న ప్రచారం అనుకున్నారు. కానీ, ఇపుడు అదే సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యా రజనీకాంత్ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. తామిద్దరం విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా స్వయంగా ధనుష్, ఐశ్వర్య వేర్వేరుగా వెల్లడించారు.
పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ధనుష్ – ఐశ్వర్యలు గుడ్ బై చెప్పారు. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని నాలుగేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి గొడవలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, కానీ,రజనీకాంత్ జోక్యంతో సర్దుకుని ఒకటిగా కనిపిస్తూ వచ్చారని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ధనుష్ వేరే హీరోయిన్‌తో సన్నిహితంగా ఉండటం ఐశ్వర్యకు నచ్చలేదని, అందుకే ధనుష్ తో గ్యాప్ మరింత పెరిగిందని టాక్ వస్తోంది. కానీ, ధనుష్ మాత్రం ఈ విడాకులకు కారణం వేరే ఉందని చెబుతున్నారట. కానీ, ఇప్పటిదాకా రజనీకాంత్ ఈ విషయంపై స్పందించలేదు. కానీ, ఈ విడాకులపై ఆయన చాలా బాధపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
గతంలో ఓసారి శింబుతో ఐశ్యర్య ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్ లో పుకార్లు షికార్లు చేశాయి. శింబు, ఐశ్వర్య ప్రేమ విషయం రజనీకాంత్‌కు తెలిసి సంబంధాలు వెతకడం మొదలు పెట్టారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తనకంటే చిన్నవాడైన ధనుష్ తో ఐశ్వర్యకు పెద్దలు పెళ్లి కుదిర్చారని తెలుస్తోంది.