బాలీవుడ్లో వెలుగుతోంది. హాలీవుడ్‌ని సైతం చూసేసింది. అలాంటిది ఓ తెలుగు సినిమాలో నటించడానికి నెర్వస్‌గా ఫీలవుతున్నానంటోంది దీపికా పదుకొనె.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’తో టాలీవుడ్లో అడుగుపెడుతోందామె. రీసెంట్గా షూటింగ్లో కూడా జాయినయ్యింది. మొదటిసారి ఈ మూవీ గురించి పెదవి విప్పింది దీపిక.
ప్రాజెక్ట్‌లో నటించడం ఓ ఎమోషనల్ ఫీల్‌ని కలిగిస్తోంది అంటోంది దీపిక. ‘ప్రభాస్‌తో, నాగ్ అశ్విన్‌తో మొదటిసారి పని చేస్తున్నాను. ఈ కథ, ఇందులోని నా పాత్ర చాలా కొత్తగా ఉన్నాయి. ఇదో కొత్త ప్రపంచంలా ఉంది. చాలా ఎక్సయిటవుతున్నాను. ఈ మూవీ కోసం ఏం చేసినా పర్లేదనిపిస్తోంది’ అంటూ భావోద్వేగానికి లోనవుతోంది దీపిక.
కెమెరా, షూటింగ్స్ కొత్త కాకపోయినా ఎందుకింత కొత్తగా అనిపిస్తోందో తెలియడం లేదట. ఇలాంటి కథను తానెప్పుడూ వినలేందంటూ దర్శకుడికి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేసింది. ప్రభాస్‌కి కాస్త సిగ్గు ఎక్కువని, తాను కూడా కాస్త అదే టైప్ అని చెప్పింది. ఆల్రెడీ ప్రభాస్ ఆతిథ్యాన్ని రుచి చూసిందామె. మొదటి రోజు షూట్లోనే అద్భుతమైన భోజనంతో దీపికకి వెల్కమ్ చెప్పాడు డార్లింగ్.
మన దేశంలోని టాప్ నటీమణుల్లో దీపిక మొదటి వరుసలో ఉందిప్పుడు. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారామెకి. ప్రభాస్ కూడా ప్యాన్ వరల్డ్ స్టార్. కాబట్టి అతనితో ఆమె జోడీ కట్టడమనేది ఈ సినిమాకి కచ్చితంగా డబుల్ క్రేజ్‌ని తీసుకొస్తుంది. మూవీని గ్లోబల్ రేంజ్‌లోకి తీసుకెళ్తుంది. దానికి తోడు మూవీ గురించి ఆమె చెప్పిన మాటలు వింటుంటే అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.