వైసీపీ హయాంలో అందినకాడికి భూములను ఆ పార్టీ నేతలు ఆక్రమించుకోవడం, కబ్జాలు చేయడం పరిపాటిగా మారిందని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక రాజధాని అంటూ విశాఖలో మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి భూ దందాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆఖరికి సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం విశాఖపట్నంలో స్టూడియో ల నిర్మాణానికి కేటాయించిన భూములనూ కాజేయడానికి వైసీపీ నేతలు స్కెచ్ వేశారని టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు.
రామానాయుడు స్టూడియో నిర్మాణానికి 35 ఎకరాల భూమిని కేటాయించగా..అందులో 15.17 ఎకరాల్లో లే ఔట్లు వేసి అమ్మేయాలని చూశారని వైసీపీ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసి ఆ అమ్మకాలు నిలిచిపోయేలా చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ భూములు మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని సభతాజాగా ఆయన ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. రామానాయుడు స్టూడియోకు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిని స్టూడియో నిర్మాణం కోసం వినియోగించలేదని, కాబట్టి, ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.