సూటు బూటు వేసి.. చక్కగా రెఢీ అయితే.. ఒక రిటైర్డు ప్రొఫెసర్ కు ఏ మాత్రం తీసిపోని ఈ దుర్మార్గుడు తెలిస్తే నోట మాట రాదు. వీడు ఇంతటి సైకోనా అన్న షాక్ కు గురి కాక మానదు. ఈ భూమి మీద అత్యంత దారుణమైన రీతిలో.. అమానవీయంగా అత్యాచారం చేసి హత్యలు చేసే సైకోల జాబితా తయారు చేస్తే.. రోడ్నీ జేమ్స్ అల్కాలా పేరు కచ్ఛితంగా ఉండాల్సిందే.
డేటింగ్ పేరుతో ముగ్గులోకి దించి.. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసే ఇతగాడు తాజాగా చచ్చిపోయాడు. ఎన్నో దారుణ నేరాలకు పాల్పడిన ఇతడు చట్టం చేతిలో శిక్షకు గురి కాకుండా చచ్చిపోవటమే పెద్ద లోటుగా అనిపించక మానదు.
అమెరికా లాంటి అగ్రరాజ్యంలో రోడ్నీ గురించి వింటేనే గగుర్పాటుకు గురి కావాల్సిందే. తాను టార్గెట్ చేసిన మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారితో డేటింగ్ పేరుతో పాశవికంగా అత్యాచారం చేశాడు. అనంతరం సుత్తితో చావబాదుతూ.. రాక్షస ఆనందం పొందుతాడు. ప్రాణాలు పోయే వరకు హింసించి కాసేపు వదులుతాడు.
మళ్లీ స్ప్రహలోకి వచ్చినంతనే మరింత దారుణంగా హింసించి చంపేస్తాడు.అనంతరం వారి చెవి దిద్దుల్ని గుర్తుగా తన వెంట తీసుకెళతాడు. ఇలా.. ఎదుటోడి చావును ఎంజాయ్ చేసే ఈ సైకో.. దగ్గర దగ్గర 130 మందిని వరకు చంపి ఉంటారని చెబుతారు.
కాకుంటే.. అతడి మీద నేరాలు మాత్రం ఎనిమిది మంది మహిళల్ని మాత్రమే చంపినట్లుగానే తేలాయి. దీంతో.. ఇతడి పాపాల చిట్టాను చూసిన కోర్టు ఇతడికి మరణశిక్షను విధించారు. అయితే.. మరణ శిక్షను అమలు చేయటానికి ముందే.. జైల్లో అనారోగ్యంతో మరణించాడు. దీంతో 77 ఏళ్ల రోడ్నీ కథ ముగిసినట్లైంది.
1968లో ఎనిమిదేళ్ల బాలికపై ఆ తర్వాత 1974లో పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో శిక్ష అనుభవించిన తర్వాత 1978లో ది డేటింగ్ గేమ్ అనే టీవీ షోలో పోటీదారుగా పాల్గొన్నాడు. అందులో విజేతగా నిలిచాడు.ఈ షోలో తనను తాను ఫోటో గ్రాఫర్ గా పరిచయం చేసుకున్నాడు. ఈ కారణంగానే అతడికి ది డేటింగ్ గేమ్ కిల్లర్ అనే పేరు వచ్చింది.