తిరుమల తిరుపతి దేవస్ధానం (TTD) ట్రస్టు బోర్డులో సభ్యత్వం ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డికి క్లీన్ రికార్డు ఉన్న వాళ్ళు ఎవరు దొరకలేదా ? ప్రభుత్వం తాజాగా నియమించిన బోర్డులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. శరత్ ఇప్పటికే ఆ కేసులో పీకల్లోతు ఇరుక్కున్నారు. అనేక నెలలపాటు జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వటానికి కూడా కోర్టు చాలా కాలం అంగీకరించలేదు. ఈడీ, సీబీఐ రిమాండ్ రిపోర్టులు, చార్జిషీట్ల ప్రకారం శరత్ స్కామ్ లో పీకల్లోతు కూరుకుపోయారు.
ఎంత కాలమైన కోర్టు బెయిల్ ఇవ్వకపోతే చివరి అస్త్రంగా భార్యకు అనారోగ్యం పేరుతో పిటీషన్ వేశారు. అప్పుడు మానవతా దృక్పదంతో కోర్టు శరత్ కు బెయిలిచ్చింది. అంటే ఇపుడు శరత్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. బెయిల్ రద్దయితే వెంటనే జైలుకు వెళ్ళాల్సిందే. ఇలాంటి వ్యక్తిని జగనో బోర్డు సభ్యుడిగా నియమించటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకన్నా మించిన వ్యక్తి జగన్ కు దొరకలేదా ? క్లీన్ రికార్డున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళల్లో ఎవరినైనా నియమించి ఉంటే బాగుండేది.
రేపు స్కామ్ విచారణ పూర్తయి పాత్ర నిరూపణ జరిగి కోర్టు శరత్ కు శిక్ష విధిస్తే అప్పుడు ఏమవుతుంది ? పోయేది టీటీడీ పరువే కానీ శరత్ ది కాదు. ఇపుడు శరత్ నియామకంతో జగన్ టీటీడీని వివాదంలోకి లాగినట్లయ్యింది. అసలే బోర్డు నియామకంలో రాజకీయ జోక్యం బాగా పెరిగిపోవటంతో అనేక వివాదాలు, ఆరోపణలు ముసురుకుంటున్నాయి. నిందితులను నియమించటం ద్వారా జగన్ తనవంతు ఆజ్యం పోస్తున్నారు.
ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే శరత్ నియామకాన్ని రద్దుచేసి మరో వ్యక్తిని నియమిస్తే బాగుంటుంది. లేకపోతే ముందు ముందు మరిన్ని వివాదాలు చుట్టుముట్టడం ఖాయమనే అనిపిస్తోంది. ప్రభుత్వం నియమించే ట్రస్ట్ బోర్డు వల్ల టీటీడీ ఇమేజి పెరగాలే కానీ తగ్గకూడదు. ఇమేజి పెరగాలంటే అందుకు తగ్గట్లే ప్రభుత్వం ఆలోచించాలి, సభ్యులను నియమించాలి.
నిన్న రిలీజ్ చేసిన 24 మంది బోర్డ్ సభ్యులలో
కేతన్ దేశాయ్ – 2010 లో సిబిఐ అరెస్ట్
శరత్ రెడ్డి – డిల్లీ లిక్కర్ స్కాంలో ED అరెస్ట్
విశ్వ రెడ్డి – బెంగళూరులో 22 ఎకరాల్లో వున్న జగన్ ఇల్లు వున్న యలహంక MLAమొత్తంగా 24 లో ఆరుగురు రెడ్లు .. TUDA చైర్మన్ ఓటింగ్ లేకున్నా సభ్యుడిగా కూడా… pic.twitter.com/jmGtFypOvt
— Gangadhar Thati (@GangadharThati) August 26, 2023