రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతోన్న నేతల నేరచరిత్ర (ADR Report) వెల్లడికావడంతో కేసీఆర్ గుట్టురట్టయినట్లయింది. ఓటింగ్ లో పాల్గొనబోయే ఎంపీలు, ఎమ్మెల్యేల నేర చరిత్ర గురించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు చేసిన సర్వేలో కేసీఆర్ టాప్-5లో నిలిచారు. ఓటింగ్ లో పాల్గొనబోయే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులుకు సంబంధించి ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ లు తాజాగా ఓ నివేదికను విడుదల చేశారు. ఈ జాబితాలో ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఐదో వ్యక్తిగా కేసీఆర్ ఉన్నారు.
ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 37 కేసులు తీవ్రమైన IPC సెక్షన్లు కలిగి ఉన్నాయి. ఇక, ఆ జాబితాలో కేరళ ఎంపీ డీన్ కురియకోస్ 204 కేసులతో మొదటి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్ కేసులతో (తమిళనాడు) డీఎంకే ఎంపీ ఎస్.కతిరవన్ రెండో స్థానంలో ఉండగా…ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ ఆజం ఖాన్ 87 కేసులతో మూడో స్థానంలో ఉన్నారు. తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో, 64 క్రిమినల్ కేసులతో కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.
మరోవైపు, సీఎం కేసీఆర్ పై తెలంగాణలో పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవతలను కేసీఆర్ అవమానించారంటూ సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ లో భజరంగ్ దళ్ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను కించపరుస్తూ కేసీఆర్ అవమానకరంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, కేసీఆర్ పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ నెల 10న నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో హిందూ దేవతలను కేసీఆర్ అవమానించారని భజరంగ్ దళ్ నేత అభిషేక్ ఆరోపించారు. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారని, తెలంగాణలో ఉన్న దేవతలను ఆయన కీర్తించారని వెల్లడించారు. కేసీఆర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు.
Comments 1