సీఎం జగన్ పై సీపీఐ నేత రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ దద్దమ్మ కాబట్టే రాష్రానికి పదేపదే అన్యాయం జరుగుతోందని షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కృష్ణా నది జలాల్లో ఏపీకి అన్యాయం జరిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. 18 జిల్లాల్లో తీవ్రమైన కరువు ఉందని, పంటలు కూడా వేయలేని స్థితిలో రైతులున్నారని, రాష్ట్ర విభజన తర్వాత ఇంత దారుణమైన కరువు పరిస్థితి ఎన్నడూ లేదని అన్నారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీరు లేదని…ఆయకట్టు అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి ఏమయ్యారని, కరువు ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. అధికారులంతా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో బిజీగా ఉన్నారని, ప్రజలను పట్టించుకునే స్థితిలో లేరని విమర్శించారు. రైతులను పట్టించుకోని ముఖ్యమంత్రి వద్దని ప్రజలంతా డిసైడ్ అయ్యారని జోస్యం చెప్పారు.