అమరావతి ఉద్యమంలో వైకాపా చేతిలో పోలీసులు పావులుగా మారుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇతర ప్రాంతాల వారిని రాజధాని అమరావతికి తరలించి అక్కడ అమరావతికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు వైకాపా చేయిస్తోందన్నది అందరికీ తెలిసిందే. నిజంగా అమరావతి వ్యతిరేకంగా ధర్నాలు కర్నూల్లోనో, విశాఖలోనో జరగాలి. కానీ విచిత్రంగా అమరావతిలో జరగడంతో వైకాపా గుట్టు రట్టయ్యింది. వైకాపా నేతల ఒత్తిడితో పోలీసులు అమరావతి రైతులుపై కేసు పెట్టారని ప్రతిపక్షాలన్నీ ఆరోపించాయి.
దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కి లేఖ రాశారు. 314 రోజులు అమరావతి ఉద్యమం జరుగుతుంటే పట్టించుకోకపోవడమే కాకుండా పరాయి వ్యక్తులు అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే అడ్డుకున్నందుకు రైతులపై కేసులు పెట్టడం సమంజసం కాదని అన్నారు. దళితులను స్థానిక దళితులు అడ్డుకుంటే ఇతర రైతులపై కేసులు పెట్టడం దారుణం అని రామకృష్ణ తప్పుపట్టారు. అమరావతి రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.