వ్యాక్సిన్ విషయంలో మోడీ బ్లండర్స్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అనూహ్యంగా వ్యాక్సిన్ ఆవిష్కరణలో ఇండియా ముందంజలో నిలవడం మన గర్వకారణం. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విషయం.
ప్రపంచంలో భారత్ బయోటిక్ కనిపెట్టిన కోవాక్సిన్ అత్యుత్తమంగా నిలిచింది. అయితే, వారికి సహాయం చేయడంలో మోడీ సర్కారు నిర్లక్ష్యం చేసింది. ఈ కారణంగా దేశానికి అవసరమైనంత వ్యాక్సిన్ ఉత్పత్తి కాలేదు.
ఆ కంపెనీలకు మోడీ సర్కారు ఏమాత్రం అండగా నిలవలేదు. తాజాగా వాటి విలువ మోడీకి తెలిసి వచ్చింది. అయినా ఇప్పటికీ మోడీ మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా పరిస్థితులు చేతులు దాటడంతో భారాన్ని రాష్ట్రాల మీదకు నెట్టేశారు మోడీ. ఇక్కడ ఒక ఘోర మోసానికి పాల్పడ్డారు. కేంద్రం కొంటే 150 రూపాయలు ధర నిర్ణయించింది. కానీ అదే వ్యాక్సిన్ రాష్ట్రాలను 400 రూపాయలకు కొనమని కేంద్రం పేర్కొంది.
దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ఒకే దేశం-ఒకే పన్ను (జీఎస్టీ)ను రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే, ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఎందుకని ఆయన నిలదీశారు. వ్యాక్సిన్ల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని ప్రధాన మంత్రి కేర్స్ నిధుల నుంచి భరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలన్న స్ఫూర్తికి అసలు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందా? అని కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు.