పాపం పండింది. నోటితో చెప్పలేని దారుణానికి పాల్పడిన ఆరాచకవాది దారుణాలు బయటకు రావటం.. పెనున సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన యువతిపై ఆమె సొంత అన్నతో పాటు.. పెద్దమ్మ కుమారుడు అజయ్ కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడిన షాకింగ్ నిజం బయటకు రావటం తెలిసిందే.
చిన్నతనం నుంచి తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాని ఆమె.. చివరకు కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయటంతో వారి దారుణాలు బయటకు వచ్చాయి. కేసు నమోదు చేయటంతో భయాందోళనకు గురైన అజయ్.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తొమ్మిదో తరగతి నుంచే సొంత అన్న.. అదే పనిగా లైంగిక దాడికి గురి కావటం.. ఇంట్లో వారికి చెబితే పట్టించుకోకపోవటంతో వారి ఆరాచకాలకు అడ్డం లేకుండా పోయింది.
అనంతరం ఇంటర్ లో పెద్దమ్మ ఇంటికి వెళితే.. అక్కడ వరసకు అన్న అయ్యే అజయ్ ఆఘాయిత్యానికి పాల్పడేవాడు. అతడి హింసలకు భయపడి.. దూరంగా ఉంటూ చదువుకొంటోంది. లాక్ డౌన్ నేపథ్యంలో తిరిగి ఇంటి రావటంతో ఆమెకు మళ్లీ నరకం మొదలైంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆమె కంప్లైంట్ ఇవ్వటంతో వారి పాపాలు బయటకు వచ్చాయి. తాము చేసిన పనులు బయటకు రావటంతో భయపడిన అజయ్.. తాజాగా సూసైడ్ చేసుకున్నాడు.