మరింత శక్తివంతమైన కరోనా వైరస్ లండన్ ను భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఇది శరవేగంగా విస్తరిస్తున్న విషయమూ తెలిసిందే. దీనికి గత వెర్షను కంటే 70 శాతం వ్యాప్తి చెందే కెపాసిటీ ఎక్కువ. అందుేక కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనను కలిగిస్తోంది.
కరోనా ఇంకా ఉద్ధృతంగా ఉన్న టైంలోనే కొత్తగా, బలంగా కరోనా రూపాంతరం చెందడం వ్యాపారపరంగా కూడా అందరినీ దెబ్బతీస్తోంది. ఇప్పటికే ఈ కొత్త వైరస్ పలు ఇతర దేశాలకు పాకినట్టు తెలుస్తోంది. ఇది భారత్ లోకి వచ్చిందన్న అనుమానం కూడా ఉంది. అనేక దేశాలు బ్రిటన్ పై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఇండియా కూడా ట్రావెల్ బ్యాన్ విధించినా అది రేపటి నుంచి నిషేధం అమల్లోకి రాబోతోంది. ఈ సమయంలో బ్రిటన్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. వీరికి టెస్టులు నిర్వహించగా 5 కొత్త కేసులు బయటపడ్డాయి.
నిన్న రాత్రి లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి చేరుకున్న 266 మంది ప్రయాణికుల్లో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ కావడం అందరిలో కలవరానికి దారితీసింది. ఉదయం బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన మరో విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో వచ్చిన ప్రయాణికులందరి శాంపిల్స్ ని సేకరించారు. వీరి ఫలితాలు రావాల్సి ఉంది.