అమ్మో బ్రిటన్ కరోనా అని దేశం, ప్రపంచం ఆందోలన చెందుతున్న విషయం తెలిసిందే. అయితే, అలాంటి కంగారేం అవసరం లేదంటున్నారు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్, కొవిడ్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణ్ దీప్ గులేరియా.
కరోనా వైరస్ లో మార్పులు, ఉత్పరివర్తనాలు కొత్తేం కాదని… ఇప్పటికే వైరస్ అనేక మ్యుటేషన్లు చెందిందని… అందులో ఒకటి బ్రిటన్ స్ట్రెయిన్ అన్నారు. కొత్త కరోనా గురించి కొత్త బెంగ అవసరమే లేదన్నారు.కాకపోతే కరోనాకు మునుపు లాగే భౌతిక దూరం అద్భుతమైన మందు అన్నారు. ఇపుడున్న మందులు, రానున్న వ్యాక్సిన్లు అన్నీ బ్రిటన్ స్ట్రెయిన్ ను సమర్థంగా నిరోధిస్తాయని గులేరియా చెప్పారు.
కొత్తకరోనా వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అప్పుడు అయినా, ఇపుడు అయినా మనం కరోనా రాకుండా చూసుకోవాలన్నారు. పాతది వచ్చిన పర్లేదు, కొత్తది మాత్రం రాకూడదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని… ఇదొక భ్రమ అని అన్నారు.
నెలకు సగటున వైరస్ లో 2 లేదా అంతకంటే ఎక్కువ మార్పులు జరిగాయని ఆయన వెల్లడించారు. వైరస్ ఎలా మారినా అది సోకినప్పుడు కలిగే లక్షణాల్లో అవే అన్నారు. కరోనా చికిత్స కూడా మారలేదని చెప్పారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటు సహజీవనం చేస్తూ పోవాలన్నారు.