అదేంటి… కరోనా టీడీపీకి మేలు చేయడమేంటి? అనుకుంటున్నారా?
అవును తెలుగుదేశం పార్టీకి కరోనా వల్ల చాలా పెద్ద మేలు జరిగింది.
ఏ పార్టీకి అయినా ఓడిపోయిన వెంటనే వచ్చే మొదటి రెండు ప్లీనరీలు చాలా ఇబ్బందికరమైనవి.
పార్టీ కేడర్లో ఉత్సాహం ఉండదు, ఆర్భాటం కోసం భారీగా ఖర్చు చేయాలి. అయినా, కీలక నాయకుల అబ్సెంట్లు సాధారణం.
ఓడిపోయిన వెంటనే అధికారం కోల్పోయిన ఏ పార్టీకి అయినా మొదటి రెండేళ్లు ఇది పెద్ద సమస్య.
కానీ మూడో ఏడాదిలోకి పడగానే పార్టీలో ఎన్నికల మూడ్ మొదలవుతుంది. అపుడు చేరికలు అవి పెరిగి ప్లీనరీలు సక్సెస్ అవుతాయి.
కరోనా వల్ల తెలుగుదేశం పార్టీకి ప్లీనరి నేరుగా నిర్వహించాల్సిన పరిస్థితి తప్పింది. ఖర్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు రెండు తప్పిపోయాయి. రెండు సంవత్సరాలు ఆన్లైన్లోనే మహానాడు జరిగిపోయింది.
ఆన్ లైన్ వ్యవహారంలో కింగ్ అయిన తెలుగుదేశానికి ఆ న్ లైన్ మహానాడు కూడా కలిసొచ్చిందనే చెప్పాలి.
మరోపార్టీ అయితే… ఈ ఆన్లైన్ మీటింగ్లును ఇంత సమర్థంగా నిర్వహించలేదు. కానీ తెలుగుదేశానికి అది కొట్టిన పిండి. ఏది ఏమైనా కరోనా వల్ల పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి.