ఇటీవల Who కూడా ఒక విషయం చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కరోనా లెక్కలు ఏవీ నిజం కాదని… కానీ దానికి యంత్రాంగంలో సమన్వయం లోపం కారణం కావచ్చు, కొన్ని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా దాచి ఉండొచ్చు అని పేర్కొంది.
కట్ చేస్తే… ఏపీలో, తెలంగాణలో కరోనా మరణాలు, కేసులు దాస్తున్నారని తెలుగుదేశం, ఇతర పార్టీలు మొదట్నుంచి ఆరోపిస్తున్నాయి. ప్రజలకు నిజాలు చెప్పమని డిమాండ్ చేశాయి.
ఏపీలో మొన్నటి వరకు 20 వేలకు పైన నమోదైన రోజువారీ కరోనా కేసులు తాజాగా సగానికి సగం తగ్గాయి. నిన్న కూడా 19 వేలకు పైన వచ్చాయి. అదేంటో ఒక్క రోజులో కేసులు గణనీయంగా పడిపోయాయి. గడచిన 24 గంటల్లో 58,835 కరోనా పరీక్షలు చేపట్టగా 12,994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… టెస్టులు బాగా తగ్గాయి. అందువల్ల కేసులు తగ్గాయి. కానీ జనాలు టెస్టులు గమనించరు. కేసులే గమనిస్తారు. కేసులు తక్కువ కనిపించడానికే టెస్టులు తగ్గించినట్టున్నారు.
ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో 2,652 కొత్త కేసులు గుర్తించారు. విశాఖ 1,690 కేసులతో రెండో స్థానంలో ఉంది. చిత్తూరులో 1,620 కేసులు, అనంతపురం జిల్లాలో 1,047 కేసులు నమోదయ్యాయి.
కృష్ణా జిల్లాలో 274 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ఇప్పటివరకు మరణాలు 10,222 నమోదయ్యాయి.