ముఖానికి మాస్కులు ఉంటాయి. కానీ.. అవి ఉండాల్సిన ప్లేస్ లో ఉండవు. ఇంట్లోనూ.. ఆఫీసులోనూ.. బ్యాగులోనూ శానిటైజర్లు ఉంటాయి. కానీ.. వాటిని వినియోగించటం తగ్గిపోయింది. కొద్దినెలల క్రితం వరకు అప్రమత్తంగా ఉన్న వారంతా ఇప్పుడు లైట్ తీసుకునే పరిస్థితి. ఇంకెక్కడి కరోనా అన్నట్లుగా లైట్ తీసుకుంటున్న వారికి షాకిచ్చేలా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొద్దినెలలుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టటం.. వ్యాక్సిన్ వచ్చేసింది కాబట్టి.. మహమ్మారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
అలాంటి వారంతా ఇక జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. తాజాగా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో నమోదైనకేసులు ఏకంగా 13,993 వచ్చాయి. దీంతో మొత్తం కేసులు 1.09కోట్లకు చేరుకున్నాయి. అంతేకాదు.. నిన్న ఒక్కరోజులో 101 మంది మరణించటం గమనార్హం. మొన్నటికి నిన్నటికి యాక్టివ్ కేసులు ఏకంగా 3585కు పెరిగాయి. దేశంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 1.07 కోట్లకు చేరుకుంది.దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో కేసుల నమోదు పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి.
నిన్న ఒక్కరోజులో 3909 కేసులు రాగా.. మిగిలిన రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండోస్థానంలో ఉన్నారు. అమెరికాలో నిన్న ఒక్కరోజులోనే 75,458 కొత్త కేసులు రావటం గమనార్హం. తర్వాతి స్థానంలో ఇండియా..మూడోస్థానంలో బ్రెజిల్.. నాలుగో స్థానంలో రష్యా.. ఐదో స్థానంలో బ్రిటన్ నిలిచాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్ ఉంటే.. తర్వాత బ్రెజిల్.. ఫ్రాన్స్.. ఇటలీ.. ఇండియాలు ఉన్నాయి.
దేశంలో యాక్టివ్ కేసులు పెద్ద ఎత్తున ఉన్న టాప్ 10రాష్ట్రాల్ని చూస్తే..
1. కేరళ
2. మహారాష్ట్ర
3. కర్ణాటక
4. తమిళనాడు
5. పశ్చిమబెంగాల్
6. ఛత్తీస్ గఢ్
7. పంజాబ్
8. ఉత్తరప్రదేశ్
9. మధ్యప్రదేశ్
10. తెలంగాణ