అరుదైన అంశానికి సంబంధించిన అధ్యయన నివేదిక ఆసక్తికరంగా మారింది. జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఒక అంశంపై జరిపిన తాజా అధ్యయనం.. వాటి ఫలితాలు కొత్త చర్చకు తెర తీశాయి. ఇంతకూ ఆ అధ్యయనం ఏమంటే.. మగాడి ముక్కుకు.. అతడి అంగం సైజుకు లింకు ఉందా? అన్నది. అయితే.. ఈ అధ్యయనం మరణించిన వారిపై నిర్వహించటంపై వచ్చిన ఫలితాలుపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఈ తరహా అంశం మీద అధ్యయనాలు జరిగినప్పటికీ.. అప్పటికి ఇప్పటికి ఫలితాల విషయంలో కాస్త తేడా ఉందన్న మాట వినిపిస్తోంది. జపాన్ లోని క్యోటో ప్రిఫెక్చూరల్ వర్సిటీ ఆఫ్ మెడిసన్ కు చెందిన శాస్త్రవేత్తలు మగాడి ముక్కు సైజుకు.. అతడి అంగం సైజుకు లింకు ఉందన్న అంశంపై పరిశోధన చేపట్టారు. తమ అధ్యయనంలో భాగంగా 126 మంది పురుషుల మృతదేహాలను ఎంపిక చేసుకున్నారు. వీరంతా 30 – 50 ఏళ్ల లోపు వారే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
తమ అధ్యయనంలో భాగంగా వారి అంగ పరిమాణంతో పాటు వారి ముక్కు పొడుగు.. వెడల్పు.. మనిషి పొడవు.. వెడల్పు.. బాడీ షేప్ తదితర అంశాల్ని పరిశీలించారు. పలు అంశాల్ని పరిశీలించిన అనంతరం వారు తేల్చిన ఆసక్తికర అంశం ఏమంటే.. ముక్కు పరిమాణానికి అనుగుణంగా అంగ పరిమాణం ఉందన్న విషయాన్ని గుర్తించారు. పెద్ద ముక్కులు ఉన్న వారి సగటు అంగ పరిమాణం పెద్దగా ఉందన్న విషయాన్ని గుర్తించారు. అయితే.. ఇదే అంశంపై గతంలో చేసిన అధ్యయనాల ఫలితాలు తాజా రిపోర్టుకు కాస్తంత వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు.
2013లో పీఎన్ఏఎస్ జర్నల్ లో ఇదే అంశంపై ఒక అధ్యయనం పబ్లిష్ అయింది. అందులో పురుషుడి హైట్.. శరీర నిర్మాణానికి.. అంగం పొడవుకు లింకు ఉందని తేల్చారు. కొంతకాలం క్రితం ఏషియన్ జర్నల్ ఆంట్రోలాజీలో ఒక పరిశోధన పత్రం కోసం ఇదే అంశంపై కొన్ని విషయాల్ని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. చూపుడు వేలు.. ఉంగరం వేలు పొడవులు.. నిస్ఫత్తి పై అంగం సైజు ఆధారపడి ఉంటుందని.. ఈ నిష్పత్తి తక్కువగా ఉంటే వారి అంగం పొడవు ఎక్కువగా ఉందని సదరు అధ్యయనం చెప్పినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. పురుషుడి శరీర భాగాలకు అతగాడి పునరుత్పత్తికి కారణమయ్యే అంగానికి మధ్య లింకుపై మరిన్ని అధ్యయనాలు జరిగితే తప్పించి.. దీనిపై మరింత స్పష్టత రావటం కష్టమని చెప్పక తప్పదు.
toef8y