కర్ణాటకలో కొన్ని నెలలుగా హిజాబ్ అంశం..తీవ్ర దుమారమే రేపుతోంది. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి వరకు ఈ వివాదం పాకింది. ప్రస్తుతం ఇది హైకోర్టు పరిధిలో ఉంది. ఇటీవలే.. దీనిపై మధ్యంతర ఉత్తర్వు లు కూడా వచ్చాయి. అయితే.. ఇంతలోనే ఇది.. రాజకీయ వివాదంగా మారుతుండడం గమనార్హం.
హిజా బ్ వివాదం గురించి మరింత వివాదంగా రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్ ‘హిజాబ్‌ను వ్యతిరేకించే వాళ్లను ముక్కలు ముక్కలుగా నరికేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
ఖాన్ వ్యాఖ్యలపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. ఇది రాజకీయ దుమారం.. రేపుతుందనే అంచనాలు వస్తున్నాయి. కర్ణాటకలోని కలబురాగిలో నిర్వహించిన ఓ సమావేశానికి ముఖరం ఖాన్ హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ..
‘హిజాబ్‌ను వ్యతిరేకిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చచ్చిపోతాం.. జీవితం ఉన్నంత వరకు భారతీయుడిగానే జీవిస్తా..హిజాబ్ ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్లను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను“ అన్నారు.
“ఏదో ఒక రోజు మనమంతా చనిపోయేవాళ్లమే…ఈ చిన్నపాటి జీవితంలో మతాల గురించి వివాదం చేయటం..అవమానపరచటం సరికాదు..ప్రతీ చిన్న విషయానికి మతాలను అంటగట్టడం సరికాదు. అన్ని కులాలను, మతాలను సమానంగా చూడాలి.
ఎవరైనా వారికి ఇష్టమైనది ఏదైనా ధరించొచ్చు. మిమ్మల్ని ఎవరైనా అడ్డగిస్తే.. ఊరుకునే సమస్య లేదని, ఇలాంటి చర్యలను సహించబోం‘ అంటూ ముఖరం ఖాన్ వ్యాఖ్యానించారు. ముఖరం ఖాన్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు… హిజాబ్ వివాదం ఇంకా క్షేత్రస్థాయిలో రగులుతూనే ఉంది. హిజాబ్ వివాదం నేపథ్యంలో సింధూర తిలకం పెట్టుకుని కళాశాలకు వెళ్లిన విద్యార్థిని విజయపుర జిల్లాలోని ఇండి కాలేజీ ప్రిన్సిపాల్ వెనక్కి పంపారు. ఆ విద్యార్థిని గేటు వద్దే అడ్డుకున్న యాజమాన్యం.. ఎలాంటి మతపరమైన చిహ్నాలకు కళాశాలలో అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థి బంధువు.. కళాశాల వద్ద ఆందోళనకు దిగారు.
అయితే పోలీసుల జోక్యంతో విద్యార్థిని లోపలకు అనుమతించారు. శ్రీరామ్ సేన ఫౌండర్ ప్రమోద్ ముతాలిక్.. ఈ చర్యను ఖండించారు. ఇండి కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
హిజాబ్ లేకుండా కళాశాలకు రావాలని యాజమాన్యం ఆదేశించినందుకు.. ఉద్యోగానికి రాజీనామా చేశారు తుమకూరు జైన్ పీయూ కాలేజీ ఆంగ్ల అధ్యాపకురాలు చాందిని. ఆత్మ గౌరవం కోసమే రాజీనామా చేశానంటూ ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా.. హిజాబ్ విషయం.. రోజులు గడిచే కొద్దీ మరింత వివాదంగా మారుతోంది.