ఎప్పుడు చూడు బూతులు తిట్టడం లేదా అయిన వాళ్లను వెనుకేసుకుని రావడం తప్ప ఈ మూడేళ్ల వైసీపీలో వచ్చిన మార్పు ఏమీ లేదు. మే 30తో వైసీపీ తన ఆధ్వర్యంలో సర్కారును ఏర్పాటుచేసి మూడేళ్లు కావస్తోంది కానీ ఇప్పటికీ పబ్లిక్ బిహేవియరిజం అస్సలు రాదు గాక రాదు. ఒక ఇంజనీరింగ్ అధికారితో ఎలా మాట్లాడాలో తెలియదు.. ఓజెడ్పీ మీటింగ్ లో ఎలా మాట్లాడాలో తెలియదు.. ఇంకా చెప్పాలంటే టు ద పాయింట్ ఎలా మాట్లాడాలో ఎవ్వరికీ తెలియదు.
కనుకనే అనంత బాబు కు బొత్స మద్దతు ఇచ్చారు.. మేమేం ఆయన్ను దాచామా అని అడగడం ఎంత అసంబద్ధంగా ఉన్నదో ! అయినా కూడా అంబటిని కానీ బొత్స ను కానీ ఆఖరికి వీళ్లందరినీ లీడ్ చేసే జగన్ ను కానీ ఏమీ అనకూడదు. ముఖ్యంగా మంత్రులెవ్వరికీ కనీస స్థాయిలో నడవడి తెలియడం లేదని మీడియా మొత్తుకుంటూనే ఉంది. ఓ క్యాబినెట్ నోట్ రాయడం కూడా వీళ్లలో ఎంతమందికి వచ్చో కూడా తమకు తెలియదు అని టీడీపీ కూడా ఎన్నో సార్లు వ్యాఖ్యానించింది.
జలవనరుల శాఖ చూసే అంబటికి ఆ శాఖపై అస్సలు పట్టు లేదు. కానీ తెల్లారితే చాలు చంద్రబాబును మాత్రం బాగానే తిడతారు.అదేవిధంగా పవన్ ను కూడా తిడతారు. తిట్ల వరకూ వైసీపీ మంత్రులంతా ఎప్పుడో పీహెచ్డీ దాటేశారని కానీ పాలనలో నే సున్నామార్కులతో రోజురోజుకూ పతనం అవుతున్నారని టీడీపీ పెదవి విరుస్తోంది. కనీసం ట్విటర్ ను కూడా హ్యాండిల్ చేయడం రావడం లేదు అని విజయ సాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన వాడే భాషనుఉద్దేశించి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు గతంలో!
అంతేకాదు సెషన్ బిహేవియర్ వాళ్లకు తెలియదని తాను పార్లమెంట్ లో మాట్లాడుతున్నా కూడా సొంత రాష్ట్రానికి చెందిన ఎంపీ మన తరఫున మాట్లాడుతున్నారే కాస్త తగ్గాలి అన్న ఆలోచన కూడా లేకుండా తన ప్రసంగానికి అడ్డం పడుతుంటారని, తాను చెప్పేదాకా విని వాటికి కౌంటర్ ఇవ్వవచ్చు కదా అని ఎన్నోసార్లు సర్దిచెప్పినా వైసీపీ ఎంపీలు వినిపించుకున్న దాఖలాలే లేవని ఎంపీ రాము అంటుంటారు.
అంటే మూడేళ్లయినా గోరంట్ల మాధవ్ లాంటి వారు పార్లమెంట్ లో మన తరఫున మాట్లాడిందేమీ లేకపోయినా ఆయన్ను మాత్రం ఏమీ అనకూడదు. ఒక్క గోరంట్లే కాదు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా ఇదే కోవకు చెందిన వారు. మరి! వీళ్లంతా ఎప్పుడు నేర్చుకుంటారు మాట్లాడడం కానీ సెషన్లో లేదా పబ్లిక్ లో నమ్రతతో కూడిన విధంగా, విధేయతతో కూడుకున్న విధంగా నడుచుకోవడం అన్నది ఎప్పుడు నేర్చుకుంటారు అని విపక్షం ప్రశ్నిస్తోంది.