పల్నాడు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. పల్నాడులో గురజాల నియోజకవర్గం చాలా కీలకమైనది. చారిత్రాత్మకంగా కూడా ఈ నియోజకర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో నెల్లూరు సిటి ఎంఎల్ఏ అనీల్ కుమార్ యాదవ్ కు ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తికి మధ్య వివాదం పెద్దదయిపోతోంది. జంగాను ఉద్దేశించి అనీల్ ఫేక నేతని అనగానే జంగా కూడా అంటే ఘాటుగా స్పందించారు.
అసలు నెల్లూరు ఎంఎల్ఏ అనీల్ కు గురజాల నేత ఎంఎల్సీ జంగాకు ఏమిటి సంబంధం ? ఏమిటంటే అనీల్ ను జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీగా పోటీచేయిస్తున్నారు. నరసరావుపేట పార్లమెటు నియోజకవర్గంలో గురజాల కూడా ఒకటి. గురజాలలో కాసు మహేష్ రెడ్డి ఎంఎల్ఏగా ఉన్నారు. కాసు ఎంఎల్ఏగా ఉన్నా తనకు టికెట్ ఇవ్వాలని జంగా పట్టుబట్టారు. అందుకు జగన్ అంగీకరించలేదు. దాంతో జగన్ పైన అలిగిన జంగా పార్టీమారే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారని అంటున్నారు.
జంగా గనుక టీడీపీలోకి వస్తే గురజాల కాకపోయినా ఏదో నియోజకవర్గంలో టికెట్ కేటాయిస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారట. అప్పటినుండి జంగా ప్రభుత్వం, జగన్ పై ఆరోపణలు మొదలుపెట్టారు. దాంతో అనీల్ కు మండిపోయి ఎంఎల్సీపై ఆరోపణలు మొదలుపెట్టారు. అప్పటినుండి అనీల్-జంగా మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జంగా చేసిన ఆరోపణల్లో ఎందులో కూడా పసలేదు. బీసీలకు వైసీపీలో గుర్తింపులేదన్నారు. వైసీపీలో సామాజికన్యాయం లేదని మండిపడ్డారు.