తమిళనాడు సీఎం స్టాలిన్ సింప్లిసిటీ గురించి పరిచయం అక్కర లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సామాన్యుడిలా ఉండడం స్టాలిన్ స్టైల్. గతంలో చెన్నైని వరదలు ముంచెత్తిన సమయంలో వరద బాధితులకు ఎలాంటి భోజనం వడ్డిస్తున్నారో తెలుసుకునేందుకు స్వయంగా స్టాలిన్ వెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇక, సామాన్య ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో స్టాలిన్ ప్రయాణించడం ద్వారా తనకు అధికార దర్పం లేదని ఆయన నిరూపించారు.
స్టాలిన్ ఒక్కరే కాదు…ఆయన కుటుంబ సభ్యులు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టాలిన్ భార్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలోని ఓ ఆలయంలో స్టాలిన్ భార్య దుర్గకు దేవుడికి వాడే ఛత్రాన్ని పట్టిన వైనం వివాదానికి కేంద్ర బిందువైంది. మాడ వీధిలో ఉత్సవమూర్తి ఊరేగింపు సందర్భంగా ఉత్సవమూర్తి తడవకుండా ఉండేందుకు ఛత్రాన్ని పట్టుకున్నారు.
అయితే, అదే సమయంలో ఊరేగింపు వెనుక దుర్గ వస్తున్నారు. దీంతో, ఆమె తడవకుండా ఓ ఉద్యోగి ఆలయ ఛత్రాన్ని పట్టుకొని ఆమెను అనుసరించాడు. దీంతో, ఆ వీడియో వైరల్ అయింది. సీఎం భార్య అయితే మాత్రం ఆమెకు ఆలయ ఛత్రం పట్టడం ఏమిటి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖలో ఇదో పెద్ద తప్పని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే, ఉత్సవమూర్తి వెనుక నుంచి ఛత్రం తీసుకెళ్తుండగా స్టాలిన్ భార్య వేగంగా నడుచుకుంటూ వెళ్లారని, ఆలయ గొడుగును దుర్గకు పట్టలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా..ఈ వ్యవహారంతో స్టాలిన్ భార్య పేరు వివాదంలో చిక్కుకున్నట్లయింది.
Shocking VVIP power trip in Tamil Nadu.
CM Stalin's wife uses deity's umbrella
India Today's @PramodMadhav6 gets us all the details#ITVideo #politics| @nabilajamal_ pic.twitter.com/jP2dNTGRvr— IndiaToday (@IndiaToday) December 12, 2022