మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మేము అమలు చేస్తున్న హామీల గురించి అడుగుతున్నావు…ఎప్పుడైనా మీ అయ్యను బీఆర్ఎస్ ఇచ్చిన హామీల గురించి అడిగినవా అంటూ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ గాడిద కొడుకులు వారిని పలకరించారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు దూరం లెక్క పెరిగిండని, కనీసం దూడకున్న బుద్ధి కూడా లేదని రేవంత్ ఘాటుగా విమర్శించారు.
పేడ మూతి బోడిలింగం కేటీఆర్ అంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగాల సమితి అని, మీరంతా దొంగలు…తోడు దొంగలు అని, కేసీఆర్ ఛార్లెస్ శోభరాజ్ వంటి వాడని, కాళేశ్వరం పేరుతో రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో తీశాడని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాకు తాగునీరు లేకుండా చేసిన దరిద్రులు రా మీరు అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒప్పందం ప్రకారం అభ్యర్థులను ప్రకటిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు.
నిజామాబాద్ ఎంపీగా గత ఎన్నికల్లో కవిత పోటీ చేసిందని, ఇప్పుడు ఇంకా ఆమె పేరు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 నెలల్లో కూలగొడతామంటూ కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత తమదంటూ ఎంతో మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో చెబున్నారని రేవంత్ అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను గేట్లు తెలిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్ప మిగతా ఎవరు మిగలరని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తనకు మద్దతుగా ఈ సభకు వచ్చారని గుర్తు చేశారు. నీతివంతమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నామని, అయితే మోడీ, కేడీ కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. అల్లాటప్పాగా తాను ముఖ్యమంత్రిని కాలేదని, నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చి ప్రగతి భవన్ తలుపులు బద్దలు కొట్టానని రేవంత్ అన్నారు.