తెలంగాణ సీఎం కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు మరింత పెంచారు. నిన్న మొన్నటి వరకు నీటి ప్రాజెక్టులను టార్గట్ చేస్తూ వచ్చిన ఆయన తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనలర్ సంస్థ తెలంగాణకు సంబంధించి ఇచ్చిన కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టకు తలమానికం వంటి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదిక వివరాలను సభలో వెల్లడించింది.
కాళేశ్వరంపై కాగ్ నివేదిక ఇదీ..
+ కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా అంచనా వ్యయం రూ.1,06,000 కోట్లకు పెంచారు.
+ మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రూ.1,47,427 కోట్లు ఖర్చు అవుతుంది.
+ ఆ ప్రాజెక్టుతో 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంది.
+ సామర్థ్యానికి మించి ప్రయోజనాలు చూపించారు
+ ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారు.
+ ప్రాజెక్ట్ నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.
+ ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించారు. 15 బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారు
+ ప్రాజెక్టుకు ఏటా రూ.700 కోట్ల నుంచి రూ.14,500 కోట్ల వరకు ఖర్చు
+ రుణాల చెల్లింపు కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి
+ కాళేశ్వరం అప్పు చెల్లించుకుంటూ పోతే 2036లో పూర్తవుతుంది.