ఏపీ సీఎం జగన్.. రాజకీయంగా దూకుడు పెంచారనేది అందరికీ తెలిసిందే. ఒకవైపు పాలన..మరోవైపు… పార్టీపైనా.. ఆయన ఏకకాలంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులకు, ఎమ్మెల్యే లకు, నాయకులకు కూడా టాస్క్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అప్పగించారు. అయితే.. ఇది పెద్దగా సక్సెస్ చేయలేక పోతున్నారని.. స్వయంగా జగనే చెబుతున్నారు. దీంతో అడపా దడపా.. ఆయన నాయకులకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.
ఇక, వెళ్లిన వారు వెళ్తున్నారు.. వెళ్లనివారు.. వెళ్లడం లేదు. ఇదిలావుంటే.. ఇప్పుడు మంత్రులకు మాత్రమే జగన్ మరో కొత్త టాస్క్ అప్పగించారు. అదేంటంటే.. ఇప్పటి వరకు ప్రజలకు మాత్రమే పరిమితమైన మంత్రుల సేవలను.. జగన్ కుటుంబానికి కూడా అందించాల్సి ఉంటుంది. అదేంటి అనుకుంటున్నా రా? ఔను.. నిజమే! జగన్ కుటుంబానికి మంత్రులు ఎలా సేవ చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయా? ఇక్కడే ఉంది.. అసలు కిటుకు.. ఇదే జగన్ వ్యూహం కూడా!
ఇప్పటి వరకు ఒకరిద్దరు మంత్రులు మాత్రమే జగన్ పక్షాన, ఆయన కుటుంబం పక్షాన భజన చేస్తున్నా రు. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నారు. మిగిలిన వారు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఆ.. మనకెందుకులే.. అని సరిపుచ్చుకుంటున్నారు. దీంతో ఒకరిద్దు మాత్రమే..జగన్ ఫ్యామిలీ తరఫున వాయిస్ వినిపిస్తున్నట్టు అయింది. గతంలో జగన్ మంత్రి వర్గంలో ఉన్న కొడాలి నాని, పేర్ని నాని.. కురసాల కన్నబాబు వంటివారు.. జగన్ ఫ్యామిలీకి మద్దతుగా మాట్లాడేవారు.
దీంతో ప్రతిపక్షాలు చేసే విమర్శలకు వారు ఏదొ ఒక రూపంలో చెక్ పెట్టేవారు. అయితే.. వీరిని మంత్రి వర్గం నుంచి తీసేసిన తర్వాత.. ఈ రేంజ్లో జగన్ కుటుంబానికి అండగా నిలుస్తున్న మంత్రులు లేకుండా పోయారు. రోజా వంటి ఫైర్ బ్రాండ్ ఉన్నా.. కేవలం ప్రభుత్వానికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఎవరూ.. జగన్ కుటుంబంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టలేక పోతున్నారనే వాదన జగన్‌లో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే జగన్తాజాగా నిర్వహించిన.. కేబినెట్ భేటీలో .. ఇక నుంచి తన కుటుంబం గురించి.. ఎవరైనా.. ఆరోపణలు చేసినా.. విమర్శలు చేసినా.. వెంటనే రియాక్ట్ అవ్వాలని.. అదే రేంజ్లో చెక్ పెట్టాలని.. కొత్త టాస్క్ అప్పగించారు. నిజానికి జగన్ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతున్న నాయకులు.. ఇప్పుడు కొత్త టాస్క్ అప్పగించిన తర్వాత.. ఊరుకుంటారా? చూడాలి మరి ఏ రేంజ్లో రెచ్చిపోతారో.. అంటున్నారు విశ్లేషకులు.
Comments 1