తనకు నచ్చింది తప్ప… ఎవరు ఏం చెప్పినా వినని వ్యక్తి జగన్.
చంద్రబాబు ఎవరి మాట వినడని ప్రచారంలో ఉంది కానీ… నిజానికి ఎవరి మాట వినని వ్యక్తి జగన్.
కానీ అందరి మనసును తెలుసుకుని నడుచుకునే వ్యక్తిలా జగన్ ఒక పొలిటికల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.
అదెలా అంటే తన అనుకున్నది ముందు ప్రచారంలో పెట్టి … దాన్ని అందరి కోరికగా మార్చి తర్వాత అమలు చేస్తాడు. దాాంతో అందరూ జగన్ తమ మాట వింటాడు అనే కోణంలో ఇక వ్యూహాన్ని క్రియేట్ చేస్తాడు జగన్.
షర్మిలకు పదవి దక్కకపోయినా… సుబ్బారెడ్డికి ఎంపీ సీటు రాకపోయినా, రోజాకు మంత్రి పదవి రాకపోయినా… అన్నీ జగన్ నిర్ణయించుకున్నవే. వాళ్లకేవో కొన్ని పదవులిచ్చి పడుండండి అన్నట్టుంది జగన్ పరిస్థితి. అలా జగన్ దయతో దక్కిన పదవి పూర్తి కాలం అయిపోయి సుబ్బారెడ్డి ఇపుడు బెంగుళూరుకు మకాం మార్చి అలిగి కూర్చున్నాడు. ఆయన అలిగినా మూలిగినా జగన్ తాను అనుకున్నదే చేస్తాడు.
తాజాగా ప్రకాశం జిల్లాకు వచ్చిన వైవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పరిపాలనతో సంబంధం లేని టీటీడీ బాధ్యతల్లో ఉండటం వల్ల తాను రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు సరైన న్యాయం చేయలేకపోయాననే అసంతృప్తి ఉందన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ప్రజలు, కార్యకర్తలకు మరింత న్యాయం చేసే అవకాశం ఉండేదని అన్నారు సుబ్బారెడ్డి.
ఆయన అన్న మరో మాటను పరిశీలిద్దాం… ‘‘తన ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరారని తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కట్టుబడి ఉంటాను‘‘ సొంత బాబాయి ఒక బయట వ్యక్తిలా ఇలా మాట్లాడాడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ సభ్యుల పట్ల ఎంత చండశాసనుడిగా ప్రవర్తిస్తాడో అర్థమవుతుంది. ఇది తట్టుకోలేక తాను బయటకు వచ్చి పార్టీ పెట్టినట్లు షర్మిల కూడా చెబుతుందట.
కొసమెరుపు – ఆయన బాబాయి వివేకానంద రెడ్డి మరణం, ఆయన మామ గంగిరెడ్డి మరణం… ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిన అంశాలు.