ఏదైనా విషయం తెరమీదికి వచ్చినప్పుడు దానిపై స్పందించాలి. అది చిన్నదైనా.. పెద్దదైనా.. రాజకీయా ల్లో టైం బాగోలేనప్పుడు వెంటనే రియాక్ట్ కావాలి. ఇలాంటి విషయాల్లో టీడీపీ అధినేత చంద్ర బాబు చాలా దూకుడుగా ఉంటారు. ఏ చిన్న పొరపాటు తెరమీదికి వచ్చినా.. నాయకులను పిలిచి హెచ్చరిస్తారు. వారిని మందలిస్తారు కూడా. వ్యక్తిగత విషయాలను నాలుగు గోడల మధ్యే తేల్చుకోవాలని కూడా చెబుతారు. పార్టీకి భంగం కలిగిస్తే.. ఊరుకునేది లేదని స్పష్టం చేస్తారు.
కానీ, ఇలాంటి తెగువ, ఇలాంటి ఆలచన చేయడంలో వైసీపీ అధినేత జగన్ పూర్తిగా విఫలమయ్యారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు విపక్షంగా ఉన్నప్పుడు కూడా.. జగన్పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. గతంలో మాజీ మంత్రులు గంట… అరగంట… ఏదైనా చేస్తావా అంటూ.. పెద్ద ఎత్తున చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై అప్పట్లోఒ రాజకీయంగా కూడా కాకరేపింది. కానీ, జగన్ ఎవరివిషయంపైనా స్పందించలేదు.
అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ నిస్సిగ్గుగా వ్యవహరించినా.. స్పందించలేదు. ఏదో పార్టీ తరఫున సజ్జలతో విచారణ చేయించానని చెప్పుకొన్నారు.ఇది కూడా జగన్ చెప్పలేదు. దీనిలో ఏమీ తప్పులేదని.. ఆయన ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోను మార్పింగ్ చేశారని చెప్పి చేతులుదులుపుకొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను చంపి..(టీడీపీ నాయకులు ఆరోపించినట్టు) డోర్ డెలివరీ చేసిన ప్పుడు కూడా జగన్ స్పందించలేదు. ఏదో నామమాత్రంగా పార్టీ నుంచి రెండు మాసాలు సస్పెండ్ చేసి.. తిరిగి తీసుకున్నారు.
ఇక, పల్నాడులో టీడీపీ నేతతోట చంద్రయ్యను దారుణంగా హత్య చేసినప్పుడు కూడా.. జగన్ స్పందించ లేదు. అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లిని పిలిచి మాట్లాడింది కూడా లేదు. ఇవన్నీ.. ఎన్నికలకు ముందు ముదురి మహా వ్యతిరేకతను పెంచేశాయి. ఫలితంగా పార్టీ ఓడిపోయింది. ఇక, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత కుటుంబ వ్యవహారం కూడా.. వైసీపీకి సెగ పెడుతోంది. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు పార్టీ నుంచిఆయనను తప్పించి.. జగన్ చేతులు ప్రక్షాళన చేసుకుంటే.. పార్టీపై మరకలు పడవు కదా! అయినా.. నిమిత్తమాత్రంగా ఉంటున్నారు. వీళ్ళలో ఒక్కరి నుంచి కూడా పార్టీ అధినేత వివరణ అడగరు… స్పందించరు. సో.. దీనిని బట్టి జగన్కు ఎగ్గు, వారికి సిగ్గు.. అనే టాపిక్ జోరుగా సాగుతోంది.