టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై తనముద్ర వేస్తున్నారు. విజన్ ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబు ఏం చేసినా.. తనదైన శైలిని అవలంభిస్తారు. తన పాలన అంటే.. ఒక ప్రత్యేకత ఉండాలనే రీతిలో ఆయన వ్యవహరిస్తారు. ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నారు. తాజాగా తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు చంద్రబాబు ముద్రను బలపరుస్తున్నాయి. అంతేకాదు.. పానలలో మరింత సౌలభ్యాన్ని కూడా తీసుకురానున్నాయి.
1) ఈ-పాలన: అంతా ఎలక్ట్రానిక్ ఆధారంగా జరిగే పాలన. దీనిని 2015-19 మధ్య చంద్రబాబు అమలు చేశారు. అంటే.. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఎక్కడున్నా.. చంద్రబాబుతో మీట్ కావొచ్చు. ఆయన తీసుకునే నిర్ణయాలు.. అమలు చేయడంతోపాటు.. వారి సలహాలు, సూచనలను కూడా చెప్పుకోవచ్చు. పైగా ప్రతినిర్ణయం కూడా రికార్డు అవుతుంది. దీనివల్ల పేపర్ వర్క్ తగ్గిపోయి.. సమయం ఆదా అవుతుంది. అదేసమయంలో పనులు త్వరగా జరుగుతాయి. రవాణా సమయం లేకుండా.. ఖర్చు కూడా ఆదా చేస్తారు.
2) జీవోల పారదర్శకత: ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి ఆర్డర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రధాన గైడ్లైన్. వాస్తవానికిఇది పాలనలో పారదర్శకత కోసం.. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్న విషయాన్ని ప్రజలు తెలుసుకునేందుకు వినియోగిస్తారు. దీనిని అందరూ పాటించాల న్నది విధానం. అయితే.. గత వైసీపీ సర్కారు.. అసలు ఈ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఏ జీవో ఇచ్చినా గోప్యంగా ఉంచేది.
దీనిపై కొందరు హైకోర్టు వరకు కూడా వెళ్లారు. దీంతో సర్కారుపై అప్పటి న్యాయమూర్తులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. జీవోలను దాచేయడం అంటే.. ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టేనని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం కొన్నిజీవోలను రాత్రికి రాత్రి అప్లోడ్ చేసినా.. కీలకమైన జీవోలను మాత్రం దేచేసింది. ఈ పరిణామం ఇప్పుడు మార్పు చేస్తూ..చంద్రబాబు జీవోలను అన్నింటినీ ఏరోజు ఆరోజు ప్రజలకు అందుబాటులో ఉండేలా.. వ్యవస్థను తీసుకువచ్చారు. ఇది బుధవారం నుంచే అమలవడం గమనార్హం.