ఏంటి హైదరాబాదులో కూడా స్వచ్ఛమైన గాలి ఉందా ? అని కౌంటర్ వేస్తున్నారా?
అర్థం చేసుకోవాలి మీరు….
ఉన్న ఏరియాలో బెటర్ ఏరియాలు అంటూ తెలంగాణ పీసీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది.
వాతావరణంలోకి రకరకాల వాయువులు విడుదల కావడం వల్ల గాలి కాలుష్యపూరితం అవుతుంది.
దీనివల్ల గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి శ్వాస సమస్యలు పెరుగుతాయి.
కాలుష్యాన్ని తగ్గించడానికి ఒకటే మార్గం చెట్లను పెంచడం.
అది హైదరాబాదులో అంత ఈజీ కాదుగా…
ఈ నేపథ్యంలో హైదరాబాద్లో స్వచ్ఛమైన గాలి ఎక్కడ లభిస్తుందనే దానిపై గాలి నాణ్యత సూచికను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసింది.
దీని ప్రకారం, జూబ్లీహిల్స్ మరియు ఉప్పల్, జూపార్క్ ఏరియాల్లో స్వచ్ఛమైన గాలి లభిస్తోందట.
కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం జూబ్లీ హిల్స్, ఉప్పల్లో గాలి నాణ్యత 30 నుండి 50 శాతం వరకు నమోదైంది.
ఈ లింకులో గాలి ఎక్కడెక్కడ ఎలాంటి నాణ్యత ఉందో తెలుసుకోవచ్చు.
Google index link: https://g.co/kgs/JCwcyY