తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ పొగడ్తల వర్షం కురిపించారు.
వాస్తవానికి న్యాయమూర్తుల స్థానంలో ఉన్నవారు.. ఎవరూ.. రాజకీయ నేతలను పొగడ్తరు కానీ.. ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ మాత్రం.. కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారని…. తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం 4 వేల 320కి పైగా ఉద్యోగాలను సృష్టించారని జస్టిస్ అభినందించారు.
చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్ మార్క్‌గా కేసీఆర్ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
సదస్సుకు ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామన్నారు.
“హైకోర్టులో ఇటీవల జడ్జిల సంఖ్య పెంచాం. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరం. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించాం. న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ మాత్రం 4,320కి పైగా ఉద్యోగాలను సృష్టించారు. ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ వచ్చింది. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతోంది. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.“ అని జస్టిస్ రమణ అన్నారు.
కేసీఆర్ ఏమన్నారంటే
రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని… న్యాయరంగంలోనూ పురోగమించేలా కృషిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామని…. ఆయా జిల్లాల్లో కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు అమితమైన ప్రేమ ఉందని.. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవ్యవస్థ సమర్ధంగా పనిచేయడం కోసం అదనపు సిబ్బందిని మంజూరు చేసినట్లు వివరించారు.
8 ఏళ్ల క్రితం తెలంగాణ.. రాష్ట్రంగా ఆవిర్భవించిందన్న కేసీఆర్.. అందరి సహకారంతో చక్కగా పురోగమిస్తోందన్నారు. పటిష్ట ఆర్థిక పురోగతిని సాధిస్తున్నామని తెలిపారు. విద్యుత్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామన్న ఆయన… తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ పట్ల జస్టిస్ ఎన్.వి.రమణకు చాలా ప్రేమ ఉందని తెలిపారు. సుదీర్ఘ కాలం పనిచేసినందున జస్టిస్ ఎన్.వి.రమణకు అన్ని విషయాలు తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బెంచ్‌ల పెంపుపై ఆనందంగా ఉందని, బెంచ్‌ల పెంపునకు అనుగుణంగా సిబ్బంది కూడా కావాలన్నారు. జిల్లా కోర్టులకు అదనపు సిబ్బందిని కేటాయింపు జరుగుతోందని తెలిపారు. జిల్లాల్లో కోర్టు భవనాల కోసం స్థల సేకరణ జరుగుతోంది. హైకోర్టు జడ్జిలకు హోదాకు తగ్గ స్థాయిలో 42 మంది జడ్జిలకు క్వార్టర్స్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.