స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు కు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలిన ఏపీ సీఐడీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం సుప్రీం కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుందని తెలుస్తోంది. మరోవైపు, మధ్యంతర బెయిల్ గడువు ఈ నెల 28న ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 29న రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది.
అయితే, రెగ్యులర్ బెయిల్ రావడంతో ఈ నెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చని హైకోర్టు తెలిపింది.మరోవైపు, చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు త్వరలో తీర్పు వెల్లడించనుంది.