చికాగోలోని ప్రవాస తెలుగువారు క్రిస్మస్ వేడుకలను సీయోను తెలుగు చర్చిలొ అత్యంత వైభవంగా సీనియర్ పాస్టర్ & ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన మాథ్యూస్ వట్టిప్రోలు గారి ఆధ్వర్యం లో జరుపుకున్నారు. యేసు ప్రభు వారి పుట్టుకను జ్ఞాపకం చేస్తూ చేసిన చిన్నపిల్లల డాన్స్, యూత్ డాన్స్ లు, కారల్ సాంగ్స్ ఎంతగనో ఆకట్టుకున్నాయి. శాంతాక్లాస్ చిన్న పిల్ల లకు గిఫ్ట్స్ అందచేశాడు.
యేసు ప్రభు వారు రెండువేల సంవత్సరాల క్రితం బెత్లహేము లో జన్మించినది స్కిట్ గ ఆవిష్కరించిన రీతి వేడుకలకు హైలైట్ గ నిలిచింది.
ఈ సందర్భంగ పాస్టర్ మాథ్యూస్ వట్టిప్రోలు గారు మాట్లాడుతూ సీయోను తెలుగు చర్చి రెండు కుటుంబాలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అరవై అయ్యిదు కుటుంబాలతో అమెరికా లో నే అత్యంత వేగంగా పెరుగుతున్న తెలుగు చర్చిగ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని కలుగచేసింది అన్నారు.
క్రిస్మస్ సందేశాన్ని అందచేస్తూ యేసు ప్రభు వారు జననం ఎందుకు అవసరమో, మానవాళికి అది యెంత అధ్బుతమొ వివరించారు…..ప్రపంచవ్యాప్తంగ క్రిస్మస్ జరుపుకుంటున్న వారందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.