ప్రభుత్వ ఆస్తి ప్రజలది. ప్రజలు అంటే అన్ని మతాల వారు ఉంటారు. ఎంత సర్వమత సమానత్వం అనేది ఉన్నా… ముఖ్యంగా మనదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్ లో 70-80 శాతం హిందువులుంటారు. అత్యున్నత సాంకేతిక పరిజ్జానంతో ఈ దేశ ప్రతిష్టను ఇనుమడిస్తున్న ఆ ఇస్రో కూడా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ అనంతరమే శాటిలైట్ ఆవిష్కరణ చేయడం ఆనవాయితీ. ఈ దేశపు ప్రజల విశ్వాసం.
అలాంటి నేపథ్యంలో, అది కూడా హిందువులు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ బస్టాండులో క్రిస్టియన్లు ఆరాధించే యేసు ఫొటోను పెట్టి పూజలు చేస్తున్నారు. అది కూడా మేనేజరు రూం బయట ప్రజలందరికీ కనపడే చోట ఇది పెట్టారు. పోనీ అన్ని మతాల దేవుళ్లతో పాటు యేసు ఫొటో పెట్టారా అంటే అదీ లేదు. ఒక్క హిందు దేవుడి ఫొటో లేకుండా కేవలం యేసు ఫొటో మాత్రమేపెట్టారు.
ఇప్పటికే ప్రభుత్వం సొమ్ముతో చర్చిలు కట్టించి విమర్శలు పాలైన జగన్ ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలతో ఏపీలోని అత్యధిక సంఖ్యాకులైన హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కనీసం అన్ని మతాల దేవుళ్ల ఫొటో పెట్టినా ఏ అనుమానాలుండేవి కాదు, కానీ కేవలం ఏసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. నిజానికి లౌకిక రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం తటస్థంగా వ్యవహరించాలి. అంటే అన్ని మతాలకు దూరంగా ఉండాలి.
కానీ హిందు దేవాలయ ఆదాయలను ఇతర మతాల సంక్షేమం కోసం వాడేంతగా కక్ష గట్టి మరీ నచ్చిన మతాన్ని పోషించేదిశగా ప్రభుత్వ పెద్దల చర్యలు కనపడుతున్నాయి. ప్రజలందరి మధ్య సహృద్భావం ఉండేలా పరిపాలన సాగాలి. సర్వమత సమానత్వం ఉండాలి. అంతేగాని ట్రాఫిక్ పోలీసులతో క్రిస్ మస్ సంబరాలు చేయించడం, కలెక్టర్లు ఇది మన ప్రభుత్వం అని మత సమావేశాలు పెట్టి చెప్పడం, టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వ్యక్తి ఏసు, అల్లా మనల్ని కాపాడతాడని చెప్పడం… ఇవన్నీ ప్రజల్లో ఆందోళనను పెంచేలా ఉన్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం మేలుకుంటే మంచిది లేకపోతే… ప్రజలు ప్రశ్నిస్తారు.