తెలుగు చలన చిత్ర పరిశ్రమ నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబోలో తెరకెక్కుతున్న #NBK107 చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ వంటి హిట్ సినిమా తర్వాత బాలయ్య నటించిన ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ట్రెండింగ్ లో ఉంది.
ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో బాలయ్య అదరగొడుతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం NBK107 యూనిట్ టర్కీ వెళ్ళింది. బాలకృష్ణ, శ్రుతి హాసన్ లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాటకు బాలయ్య అదిరిపోయే స్టెప్పులేయబోతున్నారట. అందాల ఆడబొమ్మ టైపులో చార్ట్ బస్టర్ హిట్ సాంగ్ ను ఈ సినిమాలో బాలయ్య అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
ఇక, ఈ సినిమాలో శ్రుతి హాసన్ కాకుండా మరో ముగ్గురు హీరోయిన్లున్నారట. మలయాళ భామ హానీ రోజ్ తో పాటు తమిళమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ‘చీకటి గదిలో చితకొట్టుడు’ ఫేమ్ చంద్రికా రవి ఐటమ్ సాంగ్ మరో రేంజ్ లో ఉంటుందట.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారని టాక్. ఈ సినిమాతో పాటు చిరంజీవి 154 సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఒకవేళ బాలయ్య సంక్రాంతి బరిలో ఉంటే చిరు తప్పుకోవాల్సి వస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఇక, ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘జై బాలయ్య’, ‘అన్న గారు’, ‘రెడ్డి గారు’ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. బాలయ్య ఛాయిస్ ప్రకారం వీటిలో ఓ టైటిల్ ను దర్శకనిర్మాతలు ఫిక్స్ చేయబోతున్నారట.