ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ మధ్య కొద్ది రోజులుగా తలెత్తిన సంక్షోభానికి మొత్తానికి నేటితో తెరపడినట్టే అనిపిస్తోంది. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడిందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల చివరి వారం నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 5వ షోకు సైతం జగన్ ఆమోదం తెలిపారన్నారు. చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చిరంజీవి పేర్కొన్నారు.
ఇండస్ట్రీ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమ తరపున ఏపీ సీఎంకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. టికెట్ రేట్లపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, నారాయణమూర్తి ఈ భేటీలో పాల్గొన్నారు. మొదటగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వీరు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.
సినీ పరిశ్రమ తరఫున సీఎంకు చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమస్యలపై ఇంకా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని సీఎం చెప్పినట్టుతెలిపారు. చిన్న సినిమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.. ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామన్నారు. టికెట్ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నామన్నారు. సీఎం నిర్ణయం మమ్నల్ని అందరినీ సంతోషపరిచిందని తెలిపారు. తక్కువ ధరలకు ప్రజలకు వినోదం అందాలనేది ఉద్దేశమని పేర్కొన్నారు.
చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామంగా పేర్కొన్నారు. చిన్న సినిమాలకు ఐదో షో వల్ల నిర్మాతలకు వెసులుబాటుకలుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జరుగుతోందని చిరంజీవి అన్నారు. తక్కువ ధరలకు ప్రజలకు వినోదం అందాలనేది ఉద్దేశంగా పేర్కొన్నారు. సినీ పరిశ్రమ తరఫున సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మనుగడ క్లిష్టంగా మారిందని దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ చిత్రాల విడుదల సమయంలో చిన్న సినిమాల పరిస్థితి కష్టంగా మారిందన్నారు. ఏటా నంది అవార్డులు ఇవ్వాలని ఆర్.నారాయణమూర్తి కోరారు. అందరి ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు వస్తున్నాయని అగ్ర దర్శకుడు రాజమౌళి అన్నారు. చిరంజీవి చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తోందని కొనియాడారు. ఐదారు నెలలుగా గందరగోళ పరిస్థితి ఉందన్నారు. గందరగోళ పరిస్థితి తెరపడే సమయం వచ్చిందని చెప్పారు. సినీ పరిశ్రమకు ఇవాళ చాలా శుభపరిణామమని హీరో మహేశ్‌బాబు అన్నారు. సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
సీఎం చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మహేష్‌బాబు అన్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని, పరిశ్రమ కోసమే ఆలోచించే వ్యక్తి చిరంజీవని పేర్కొన్నారు. చిన్న సినిమాలకు స్థానం ఉండాలని ప్రభుత్వాన్ని కోరారని తెలిపారు. ఈ నెలాఖరులోపు అన్నింటిపై పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందన్నారు. విశాఖలో కూడా చిత్రీకరణ జరగాలని సీఎం కోరుకుంటున్నారని పేర్ని నాని తెలిపారు.