ఈ మధ్యకాలంలో చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు తమ పేర్ల స్పెల్లింగ్ ను మార్చకుంటున్న సంగతి తెలిసిందే. పేరు మార్చుకుంటే లక్కు దక్కుతుందని వారి నమ్మకం. అందుకే, న్యూమరాలజిస్ట్ లు తమకు చెప్పిన ప్రకారం వారు తమ పేరులో ఓ అక్షరాన్ని తీసేయడమో, కలపడమో చేస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కూడా చేరినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి తన పేరు మార్చుకున్నారని, తన పేరుకు మరో అక్షరాన్ని జతచేసుకున్నారని టాక్ వస్తోంది. ‘CHIRANJEEVI’ గా ఉన్న పేరుకు…మరో ‘E’ జతచేసి… ‘CHIRANJEEEVI’ అని మార్చుకున్నారని తెలుస్తోంది. చిరంజీవి నటిస్తోన్న ‘గాడ్ ఫాదర్’ మూవీ ఫస్ట్ లుక్ లో ‘Megastar Chiranjeevi’కి బదులు ‘Megastar Chiranjeeevi’ అని ఉంది. ఒక న్యూమరాలజిస్ట్ సలహా ప్రకారం చిరంజీవి ఈ మార్పు చేసుకున్నారని తెలుస్తోంది.
అయితే, చిరంజీవి తన పేరు మార్చుకున్నట్లు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో, చిరంజీవి పేరు మారలేదని, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పొరపాటున అదనంగా మరో E యాడ్ అయిందని మరో టాక్. ఏది ఏమైనా ఈ పేరు మార్పుపై చిరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ సందిగ్ధానికి తెరపడేలా లేదు. అయినా, చిరంజీవి వంటి స్టార్ హీరో పేరును ఎడిటింగ్ లో తప్పు కొట్టి ఉంటారా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.