చిరంజీవి రాజకీయ ప్రవేశం, నిష్క్రమణపై ఎంతో చర్చ జరిగింది. అయితే, చాలావరకు చిరంజీవి పట్ల సానుకూలంగా మాట్లాడేవారే ఎక్కువ. ఒకరకంగా చెప్పాలంటే జనసేన కంటే ప్రజారాజ్యం, పవన్ కంటే చిరంజీవి మెరుగైన రాజకీయం చేశారని విశ్లేషించిన వారున్నారు. ఇక రాజకీయంలో ఉన్నపుడు మీడియా ఎలా వేటాడుతుందో ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు చిరంజీవి. నవ్వుతూ మీడియాకు వాత పెట్టేశారు. మీడియా ప్రేమతో వెంట ఉండదని… తప్పులు దొరకబుచ్చుకోవడానికి మాత్రమే వెంట ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అది ఆయన మాటల్లో వింటే భలే ఉంటుంది.
ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి టార్గెట్ చేసిన ఆ నాలుగు ఛానెల్స్ సాక్షి, టీీవీ9, ఎన్టీవీ, ఎక్స్ ప్రెస్ టీవీ అని తెలుస్తోంది. అందరికీ కబుర్లు చెప్పే సాక్షి, టీవీ9 లు మరి చిరంజీవి బయటపెట్టని వారి అసలు రంగుకు ఎలా సమాధానం ఇస్తాయో మరి.