మెగాస్టార్ రాజకీయ పునరాగమనం జరగనుందా? త్వరలో ఆయన జనసేనలో చేరిపోతారా? ఇప్పటికే ఆయన ఈ మేరకు నిర్ణయించుకున్నారా? పవన్ తో చర్చలు జరిపారా?
ఈ ప్రశ్నలన్నిటికి ఒకటే సమాధానం : అవును !!
ఇదేమీ గాసిప్ కాదు, స్వయంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యల సారాంశం. త్వరలో పవన్ కల్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారు. పవన్ కు అండగా ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చారు. అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. సినిమాలను వదిలేసిన తమ్ముడిని పవన్ మళ్లీ సినిమాలు తీసేలా ఒప్పించారట. అందుకే పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. దానికి రిటర్న్ గిఫ్టో ఏమో గాని… అన్నని చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఎలాగూ అన్నను సీఎంగా చూడాలని పవన్ కలలు కన్నారు.
భవిష్యత్తులో తెలుగుదేశం, వైసీపీ గెలిచే అవకాశం లేదని బీజేపీ -జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని పవన్ సోము వీర్రాజు గట్టిగా నమ్ముతున్నారట. ఇందులో భాగంగా అన్నయ్యని తెస్తే బీజేపీ కూడా ఎలాగోలా అన్నయ్యను సీఎం చేయొచ్చన్న ఆలోచన పనవ్ కి వచ్చినట్టుంది.
అదయినపుడు చూద్దాం అని మీరనుకోవచ్చు.. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని కూడా మీకు అడగాలని అనిపించొచ్చు. కానీ ఎవరూ ఓడిపోతామని రాజకీయాలు చేయరు. ఏవో కొన్ని లెక్కలు వేసుకుని గెలుస్తామనే అనుకుంటారు. ఆ క్రమంలోనే అన్నదమ్ములకు కొత్త ఆశ పుట్టిందేమో మరి.