• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సీఎం స్టాలిన్ తో ‘స్టాలిన్’ భేటీ…ఏంటి మ్యాటర్ ?

సీఎం స్టాలిన్ తో చిరు భేటీ...స్టాలిన్ పాలనపై పవన్ ప్రశంసలు

admin by admin
September 1, 2021
in Movies
0
0
SHARES
509
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలపై, చేపడుతున్న పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోన్న సంగతి తెలిసిందే. తమిళనాడులో రివేంజ్ పాలికిట్స్ కు స్వస్తి చెప్పిన స్టాలిన్…అభివృద్ధే తారక మంత్రంగా దూసుకుపోతున్న వైనంపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టాలిన్ ను టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. చెన్నైలో సీఎం స్టాలిన్ ను కలిసిని సినీ ‘స్టాలిన్’…పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. స్టాలిన్ తో చిరు భేటీ అయిన సందర్భంగా అక్కడ స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు.

ఇక, స్టాలిన్ పై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. సీఎంగా స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరును పవన్ అభినందించారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలని, అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదని పవన్ అన్నారు. ఈ విషయాన్ని స్టాలిన్ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు. స్టాలిన్ పరిపాలన, ప్రభుత్వ పనితీరు దేశంలోని మిగతా రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం అని పవన్ అభినందించారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్…అంతర్జాతీయ స్థాయి నిపుణులను ఆర్థిక సలహాదారులుగా నియమించి సంచలనం రేపారు. స్టాలిన్ ఏర్పాటు చేసిన అర్ధిక సలహా మండలిలో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ , నోబెల్ విజేత ఎస్తేర్ డుఫ్లో సహా ఐదుగురు ఆర్ధికవేత్తలను సభ్యులుగా నియమించారు. పేదలు, సామాన్యుల కోసం నియమించిన ఈ మండలి మంచి ఫలితాలనిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పెట్రో మంటలు రేగుతుంటే…తమిళాడులో లీటర్‌ పెట్రోల్‌ పై మూడు రూపాయల తగ్గించడం వెనుక ఈ మండలి పాత్ర కీలకం.

ఇక, రివేంజ్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో స్టాలిన్ నవశకానికి నాంది పలికారు. ఏఐడీఎంకే దివంగత అధినేత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లను అదే పేరుతో కంటిన్యూ చేసి స్టాలిన్ ఏపీ సీఎం జగన్ కు ఆదర్శంగా నిలిచారు. ఏపీలో జగన్ అన్న క్యాంటీన్లను తీసివేసిన వైనాన్ని అమ్మ క్యాంటీన్ల ఉదంతంతో ఏపీ ప్రజలు పోల్చి చూస్తున్నారు. ఇక, రూ.13 కోట్ల విలువైన జయలలిత, పళనిస్వామి బొమ్మలతో ఉన్న 65 లక్షల బ్యాగులను యధావిధిగా పిల్లలకు అందించాలని స్టాలిన్ ఆదేశించడంతో విపక్ష నేతలూ షాకయ్యారు.

కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలోనూ విపక్ష సభ్యులకు అవకాశం ఇచ్చిన స్టాలిన్ సొంత పార్టీ నేతలను సైతం ఆశ్చర్యపరిచారు. ఇక, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్‌ కల్పించే బిల్లుకు ప్రతిపక్ష ఏఐడీఎంకే కూడా ఆమోదం తెలిపిందంటే స్టాలిన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తనపై పొగడ్తలు మానకపోతే చర్యలు తప్పవంటూ అసెంబ్లీ సాక్షిగా సొంత పార్టీ నేతలకు స్టాలిన్ ఇచ్చిన వార్నింగ్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Tags: chiru meets stalinmega star chiranjeevipawan kalyantamilanadu cm stalin
Previous Post

జగన్ కు మరో షాక్…ఆ జీవోకు హైకోర్టు బ్రేక్

Next Post

‘శాక్రమెంటో తెలుగు సంఘం’ ఆధ్వర్యంలో ఆగష్టు 29, 2021 న శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి ‘తెలుగు భాషా దినోత్సవం’

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!

June 15, 2025
Load More
Next Post

‘శాక్రమెంటో తెలుగు సంఘం’ ఆధ్వర్యంలో ఆగష్టు 29, 2021 న శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి ‘తెలుగు భాషా దినోత్సవం’

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra