కొన్ని నెలల ముందు మెగా అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ ఉన్నంతలో బాగానే ఆడింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్‌బస్టర్ కావడమే కాక రామ్ చరణ్‌కు వరల్డ్ వైడ్ మంచి పేరు తెచ్చి పెట్టింది.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య లైన్లో ఉండడంతో హ్యాట్రిక్ సక్సెస్ చూడబోతున్నామని మంచి జోష్‌తో ఉన్నారు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా దారుణమైన డిజాస్టర్ అయి అభిమానుల ఉత్సాహం మీద నీళ్లు చల్లింది. ఈ సినిమా చిరుతో పాటు చరణ్ కెరీర్ మీదా కొంత ప్రతికూల ప్రభావం చూపింది.
ఆచార్య చేదు అనుభవం చాలా కాలం మెగా అభిమానులను వెంటాడుతుందనడంలో సందేహం లేదు. దాన్నుంచి బయటపడేసేలా చిరు తర్వాతి సినిమాతో మ్యాజిక్ జరుగుతుందని వారు ఆశతో ఉన్నారు.
కానీ గాడ్ ఫాదర్‌కు సంబంధించి ఇప్పటిదాకా అయితే ఏదీ ఆశాజనకంగా కనిపించడం లేదు. టీజర్, ఇతర ప్రోమోలన్నీ కూడా సాధారణంగా అనిపించాయి. సినిమాకు బజ్ తీసుకొస్తాయనుకున్న ప్రోమోలు కాస్తా.. నెగెటివిటీని పెంచుతున్నాయి. అసలు ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో క్యామియో చేయించాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న మెగా అభిమానుల నుంచి తలెత్తుతోంది.
చిరు తన రేంజ్ తాను మరిచిపోతున్నడని.. ఆయనకు ఎవరి సాయం అక్కర్లేదని.. ఉత్తరాదిన సినిమాకు హైప్ రావాలంటే కంటెంట్ ఉంటే సరిపోతుందని.. కేజీఎఫ్, పుష్ప సినిమాలో ఏ బాలీవుడ్ స్టార్ నటించాడని వాటికంత క్రేజ్ వచ్చిందని.. అయినా ఒక సగటు మాస్ మసాలా సినిమా, అందులోనూ రీమేక్ మూవీతో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించాలనుకోవడం, అందుకోసం సల్మాన్‌తో క్యామియో చేయించడం సరైన ఆలోచనేనా అని మెగా అభిమానులే ప్రశ్నిస్తున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన టక్కర్ మార్ పాట సాధారణంగా అనిపించి, ట్రోలింగ్‌కు గురవుతుండటం మెగా ఫ్యాన్స్‌ను బాధిస్తోంది. సైరా దగ్గర్నుంచి కొణిదెల ప్రొడక్షన్స్ ప్రమోషన్ల పరంగా ఫెయిలవుతూనే ఉందని.. సినిమాకు హైప్ తీసుకొచ్చే టాలెంట్, ప్లానింగ్ ఈ టీంలో లేదని, కనీసం చెప్పిన టైంకి ప్రోమో రిలీజ్ చేయడం కూడా చేతకాని టీంతో ఏం లాభమని మెగా అభిమానులే సోషల్ మీడియాలో కొణిదెల ప్రొడక్షన్ టీం మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
zcohrn