మెగాస్టార్ చిరంజీవి
ఒక పార్టీ పెట్టి రాష్ట్రంలో 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు.
కేంద్ర మంత్రిగా కీలక పదవిలో చేశారు.
అయినా ఆయన ఎందుకో జగన్ పిలుపు వినపడితే చటుక్కున పరుగెత్తుతారు
జగన్ ని అడగకపోయినా ప్రశంసిస్తారు.
కానీ జగన్ తమ్ముడికి జగన్ అన్యాయం చేస్తే నోరు మెదపరు.
ఇప్పటికే జగన్ రెండు మూడు నిష్ఫలమైన భేటీలు అయ్యాయి చిరంజీవికి.
వాటి వల్ల ఏం ఒరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
తాజాగా మరోసారి జగన్ పిలిచారట. 20వ తేదీన పరుగెత్తుకుని వెళ్తున్నారు చిరంజీవి.
సినిమా టిక్కెట్లపై మొన్నేమో రేట్లతో కంట్రోల్ చేశాడు జగన్.
తాను ఒకవైపు పార్కింగ్ రేట్లు, గుడిలో ప్రసాదం రేట్లు, పార్కింగ్ రేట్లు, కరెంటు బిల్లులు అన్నీ పెంచుతాడు.
కానీ సినిమా టిక్కెట్ల రేట్లు మాత్రం తగ్గించాలట. ఇందులో లాజిక్ అసలు కనపడదు.
చివరకు టిక్కెట్లు కూడా తానే చేతుల్లోకి తీసుకుని ఆ డబ్బులు డైవర్ట్ చేసే మాస్టర్ ప్లాన్ వేసింది జగన్ సర్కారు.
దానిపై మోహన్ బాబు గాని, చిరంజీవి గాని ఒక్క విమర్శ కూడా చేయలేకపోయారు.
ఆ సలహా చిరంజీవి, నాగార్జునదే అని ఏపీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పైగా బెయిలు మీద ఉన్న సీఎంగా ఖ్యాతి గాంచిన జగన్ పిలిచాడని, తమ పరిశ్రమను అణచివేస్తున్నా ఈనెల 20న జగన్ పిలవగానే ఆయన్ను కలవడానికి రెడీ అయిపోయారు సినిమా పెద్దలు.
కారణమిదేనా : సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ మీటింగ్ అని చెబుతున్నారు. ఇంతకు ముందు కలిసిన వాటికే దిక్కులేదు. పైగా జగన్ సృష్టించిన సమస్యను అదేపనిగా పవన్ మీద కోపంతో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని బతిమలాడేందుకు ఆయన వద్దకు వెళ్తున్నారు సినీ పెద్దలు. వీళ్లకు జగన్ సరైన మొగుడు అని పలువురు ఏపీ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం గమనార్హం.