ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న తేజ్ కుడి కన్ను, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం అయిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన తేజ్‌ను మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి ధరమ్‌తేజ్‌ను తరలించారు. అయితే, సాయిధర్మ్ తేజ్‌కు ప్రాణాపాయం లేదని, ఆయన స్పృహలోకి వచ్చారని, ఆందోళన చెందవద్దని లేదని వైద్యులు తెలిపారు. ధరమ్ తేజ్ కాలర్ బోన్ విరిగిందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. అయినప్పటికీ, తేజ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి కీలక ప్రకటన చేశారు.
అభిమానులు ఆందోళన పడవద్దని, పుణులైన వైద్యుల పర్యవేక్షణలో రమ్‌తేజ్ కోలుకుంటున్నారని చిరంజీవి తెలిపారు. మరో రెండు,మూడు రోజుల్లో సాయిధరమ్ తేజ్ ఇంటికి తిరిగి వస్తాడని అభిమానులు కంగారు పడవద్దని చిరంజీవి అన్నారు. ఆసుపత్రి వైద్యులను అడిగి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని చిరంజీవి తెలుసుకున్నారు. అభిమానులు సోషల్‌మీడియా వరుస ట్వీట్లు పెడుతుండగా….చిరు వారిని కంగారుపడవద్దని, తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ట్వీట్ చేశారు.
అంతకుముందు, ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్, నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌తోపాటు సందీప్ కిషన్ హుటాహుటిన మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్నారు. సోషల్‌మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు తేజ్ కోలుకోవాలని ట్వీట్లు పెడుతున్నారు. ‘బ్రదర్ సాయిధరమ్‌తేజ్.. త్వరగా కోలుకోవాలి’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రవితేజ, నిఖిల్, మంచు మనోజ్, కార్తికేయ, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు శ్రీనువైట్ల తదితరులు కూడా తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.