రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ పాపులర్ పొలిటీషియన్.
చింతమనేని ప్రభాకర్… ఏపీ రాజకీయాల్లో మోస్ట్ పాపులర్ పొలిటీషియన్.
ఒకప్పుడు ఇద్దరు తెలుగుదేశమే. ఇపుడు రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఈ ఇద్దరు కలవడం గతంలో ఎవరూ పెద్దగా చూడలేదు. ఇద్దరివి వేర్వేరు ప్రాంతాలు కావడం ఒక కారణం అయితే.. చింతమనేని వెలుగులోకి వచ్చేనాటికి రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో లేరు. కాకపోతే ఇద్దరికి మంచి పరిచయాలే ఉన్నాయి. తాజాగా రేవంత్ రెడ్డిని తన కూతురు పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్లారు చింతమనేని. త్వరలో జరగనున్న తన కూతురు పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటో వైరల్ అవుతోంది.
చింతమనేని నిన్నే నందమూరి బాలయ్యను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈరోజు రేవంత్ ను కలిశారు. వీరికే కాదు… చాలామందిని ఆయన ఆహ్వానించారు. ఈ ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.