ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టేశారు. విషయం ఏమిటంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఆయనతో పాటు అధికారులు కూడా తిరుగుతున్నారు. దీన్ని ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకున్నాయి. ఏ హోదా ఉందని అధాకారులంతా మోహిత్ రెడ్డి వెంబడి తిరుగుతున్నారంటూ కొద్దిరోజులుగా విపక్ష నేతలు గోల చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎంఎల్ఏ చెవిరెడ్డి…ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు.
విషయాన్ని గమనించిన జగన్ వెంటనే మోహిత్ ను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) ఛైర్మన్ గా నియమించారు. తుడా పరిధిలోకి చంద్రగిరి కూడా వస్తుంది. కాబట్టి ఇపుడు మోహిత్ తుడా ఛైర్మన్ హోదాలో తుడా పరిధిలో ఎక్కడ తిరిగినా అదికారులు ఆయన వెంట ఉండాల్సిందే. కాబట్టి ఇపుడు తుడా ఛైర్మన్ హోదాలో మోహిత్ గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో తిరుగుతున్నారు. ఆయన వెంట అధికార యంత్రాంగమంతా నిలబడింది. ఈ విధంగా ప్రతిపక్షాలకు జగన్ చెక్ చెప్పినట్లయ్యింది. ఒకమాటలో చెప్పాలంటే ప్రతిపక్షాల దయతోనే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఆ కీలక పదవి దక్కింది.
రాబోయే ఎన్నికల్లో మోహిత్ రెడ్డే చంద్రగిరిలో వైసీపీ అభ్యర్ధన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మోహిత్ ను అభ్యర్ధిగా జగన్ ప్రకటించారు. ఎంఎల్ఏ చెవిరెడ్డికి జగన్ ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన ఎక్కువగా తాడేపల్లిలోని సెంట్రల్ ఆఫీసులో ఉంటున్నారు. సెంట్రల్ ఆఫీసు ఆధారంగా చెవిరెడ్డి వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అందుకని తన నియోజకవర్గంలో ఉండటం కుదరటంలేదు.
ఈ విషయం అర్ధమవ్వటంతోనే మోహిత్ ను రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధిగా జగన్ ప్రకటించింది. చెవిరెడ్డి సేవలను నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకోవాలని జగన్ అనుకున్నారు. అందుకనే ప్రత్యేకమైన బాధ్యతలను అప్పగించారు. గతంలో చెవిరెడ్డి వెంట తిరిగిన అధికారులే ఇకనుండి మోహిత్ రెడ్డి వెంట తిరుగుతారు. ఈ విధంగా మోహిత్ కు ఛైర్మన్ పదవి రావటానికి ప్రతిపక్షాలు కారణంగా నిలవడం ఎపిసోడ్లో కొసమెరుపు. మరి తనకు అందివచ్చిన ఛైర్మన్ పోస్టులో మోహిత్ ఎలా పనిచేస్తారో వేచి చూడాలి.