రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎంఎల్ఏ కొడుక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే. ఈ విషయాన్ని స్వయంగా ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డే ప్రకటించారు. వైఎస్సార్ ఆసరా పథకంలో లబ్దిదారులను ఉద్దేశించి చెవిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. రెండు ఎన్నికల్లో తనను గెలిపించినట్లే తన కొడుకును కూడా గెలిపించాలని ఎంఎల్ఏల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సో, చెవిరెడ్డి తాజా ప్రకటనతో చంద్రగిరిలో పోటీ చేయబోయేది మోహిత్ అన్న విషయం తెలిపోయింది. వచ్చేఎన్నికల్లో చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారట. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటు కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందికాబట్టి చంద్రగిరిలో పోటీచేయటం కష్టమని చెవిరెడ్డి కూడా జగన్ కు చెప్పుకున్నారట. చెవిరెడ్డి రిక్వెస్టు జెనూయిన్ కాబట్టి జగన్ కూడా మోహిత్ పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే వారసులకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేదిలేదని జగన్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలోనే తేల్చేశారు. తమ పిల్లలకు టికెట్లు ఇవ్వాలని బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, పేర్నినాని లాంటి చాలామంది జగన్ను అడిగారు. అయితే ఏ వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవి కాబట్టి వారసులకు టికెట్లిచ్చి ప్రయోగం చేయకూడదన్నది జగన్ భావన. ఇదే విషయాన్ని ఇప్పటికే రెండు మూడుసార్లు ప్రకటించారు.
అయితే అనారోగ్యం, వృద్ధాప్య కారణాలను మాత్రం పరిగణలోకి తీసుకోవాలని జగన్ అనుకున్నారట. ఈ కోటాలోనే ఎమ్మిగనూరు, మైదుకూరు లాంటి నాలుగు, ఐదు నియోజకవర్గాల్లో మాత్రం వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే చెవిరెడ్డికి పై రెండు సమస్యలు లేకపోయినా జగనే ఏరికోరి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఒకవైపు పార్టీలో బాధ్యతలను చూసుకుంటే మరోవైపు నియోజకవర్గంలో తిరగాలంటే కష్టం. అందుకనే చంద్రగిరిలో మోహిత్ కు టికెట్ కన్ఫర్మ్ చేస్తే తాను పార్టీ బాధ్యతల్లో ఉంటానని చెవిరెడ్డి అడిగిందానికి జగన్ కన్వీన్స్ అయ్యారట. అందుకనే మోహిత్ పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.