తిరుపతి ఉపఎన్నికలో ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల డ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా పుంగనూరు, పలమనేరు, కడప తదితర ప్రాంతాల నుంచి జనాలను తీసుకువచ్చి మరీ దొంగ ఓట్లు వేయించారని టీడీపీ నేతలు ఆధారాలతో సహా నిరూపించారు. అయితే, వైసీపీ నేతలు దొంగ ఓటర్లను రంగంలోకి దించుతున్నారన్న విషయం వైసీపీలో ఓ వర్గం నేతలే లీక్ చేశారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆ వైసీపీ నేతల ఫోన్ కాల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చిప్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో వైసీపీ నేతతో దొంగ ఓటర్లను తరలించేందుకు బస్సులు ఏర్పాటు కోసం మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోలు దుమారం రేపుతున్నాయి. ”మా పాట్లు ఏవో మేమే పడతాం మా 450 ఓట్లకు అంత శ్రమ మీకెందుకులే” అనే చెవిరెడ్డి ఆడియో లీక్ తాజాxe సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తిరుపతిలో ఓటు దొంగలను పట్టించింది వైసీపీలోని అంతర్గత కుమ్ములాటలేనని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
మంత్రి అవ్వాల్సిన చెవిరెడ్డిని ముందుగా సమన్వయం చేసుకోలేదని, చెవిరెడ్డిని నమ్మకుండా కొందరు వైసీపీ నేతలు ముందే ప్లాన్ చేసుకొని బస్సులు బయలుదేరే ముందు చెవిరెడ్డికి సమాచారమివ్వడంతో ఆయన సహకరించలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంత హఠాత్తుగా చెబితే ఆయన ఎలా సహకరిస్తారని సెటైర్లు వేస్తున్నారు.
పోలింగ్ నాడు సెలవు రోజు…అటువంటి రోజున కడప నుండి పాస్పోర్ట్ ఆఫీసుకు, పెళ్లి మూహూర్తాలు లేని సమయంలో కళ్యాణమండపాల దగ్గర, 300 ఆన్లైన్ బుకింగ్ వుంటే తప్ప కొండమీదకు వదలం అన్నా కూడా దర్శనాలకు వచ్చిన బస్సులన్నీ పట్టుబడ్డాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే, అన్ని బస్సులు పట్టుబడేలా సమాచారం సేకరించడం బిజెపి & టిడిపి వారి వల్లా అయ్యే పని కాదని, హ్యాండ్స్ అప్ అని కరెక్ట్ గా దొంగ ఓటర్లను అడ్డుకోవడం అంత సులువు కాదని చెబుతున్నారు.
వైసీపీలో భావి పుడింగు నిజరూపాన్ని జనంలో ముసుగు తీసి ఇలా నిలబెట్టిన ఆయన వ్యతిరేక గ్రూపునకు అభినందనలు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భావి బిజెపి-వైసీపీ & అసలైన రెడ్డి-వైసీపీల మధ్య అంతర్గత కుమ్ములాటలు ముదిరి ఈ ఉప ఎన్నికల్లో బయటపడ్డట్లు అనిపిస్తోందంటూ ఎద్దేవా చేస్తున్నారు.