చీరాల నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడి ఎమ్మెల్యేపై టాక్ ఎలా ఉంది..? అనే అం శాలు ఆసక్తిగా మారాయి. ప్రతి నియోజకవర్గంలోనూ.. ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. ఒక్కొక్క నియోజకవ ర్గంలో ఒక్కొక్క పరిస్థితి ఉంది.
చీరాల విషయానికి వస్తే.. వాస్తవానికి ఇది వైసీపీ గెలుచుకున్న సీటు కాదు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానం. అయితే.. ఇక్కడ నుంచి గెలిచిన కరణం బలరాం.. వైసీపీకి మద్దతు దారుగా మారిపోయారు.
దీంతో ఆయన ఇక్కడ వైసీపీ నాయకుడిగానే చక్రం తిప్పుతున్నారు. ఆదిలో కొంత ఆయనకు ప్రజలకు గ్యాప్ వచ్చినా.. ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుని.. చిన్నపాటి రోడ్లు అయితే నిర్మించారు. ముఖ్యంగా చిన్న చిన్న కల్వర్టులు.. రహదారుల నిర్మాణం చేపట్టారు. దీంతో కొన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యేగా ఆయన పనితీరుకు మంచి మార్కులే వేస్తున్నారు. అయితే.. ప్రజల మధ్య ఉండడం లేదని.. మరికొందరు చెబుతున్నారు.
కేవలం ఆయన ఒంగోలుకు మాత్రమే పరిమితం అవుతున్నారని..పనులు చేయిస్తున్నా.. ప్రజల సమస్య లు పట్టించుకోవడం లేదని, వ్యక్తిగతంగా ప్రజలకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేయడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదిలావుంటే..కరణం పనిచేస్తున్నా.. ఆయన ఏ పార్టీ నాయకుడు అనే విషయంపైనా. ప్రజల్లో గందరగోళం నెలకొంది.
ఇప్పటికీ కూడా కరణంను టీడీపీ నాయకుడిగానే ప్రజలు చూస్తున్నారు. టీడీపీకే ఓట్లు వేశామని.. అంటు న్నారు. ఈ పరిణామం.. కరణంను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పోటీ చేసినా.. ప్రజలు టీడీపీ నేతగా చూస్తే.. మొత్తానికి ఆయనకు గెలుపు గుర్రం ఎక్కడం కష్టమనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. అంటే.. కరణం పార్టీ మారినా.. ప్రజలు ఆయనను మాత్రం టీడీపీ నాయకుడిగానే చూస్తున్నారన్న మాట!!