టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటి సనాకు ఉన్న గుర్తింపును ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆమె.. వెండితెర మీద ఏ పాత్రను చేసినా.. డీసెంట్ పాత్రల్నే చేశారు. అమ్మగా.. వదినగా.. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వంక పెట్టని.. వేలెత్తి చూపని రీతిలో నటించిన ఆమె.. ఇటీవల ‘మెట్రో కథలు’ వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రను పోషించిన వైనం ఆమెను ఒక్కసారి వార్తల్లోకి తీసుకొచ్చింది. సనా అలాంటి పాత్రలో పోషించటమా? అని పలువురు ఆశ్చర్యపడే పరిస్థితి.
ఈ సిరీస్ లో పెళ్లై భర్త ఉన్న ఆమె మరో వ్యక్తితో బెడ్ షేర్ చేసుకునే పాత్రను పోషించటంతో పాటు.. ఇంటిమేట్ సీన్ లో ఆమె నటించిన తీరుపై హాట్ కామెంట్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక యూట్యూబ్ చానల్ తో మాట్లాడిన ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్.. రచయిత చెప్పినట్లుగా తాను ఆ పాత్రను చేసినట్లుగా చెప్పారు.
తాగుబోతు భర్త కారణంగా ఒక మధ్యతరగతి మహిళ పడే ఇబ్బందులు.. కష్టాలను ఈ మెట్రో కథలలో చూపించారని.. తన పాత్రతో చాలామంది స్ఫూర్తి పొందుతారని వ్యాఖ్యానించారు. భార్యని పట్టించుకోని తాగుబోతు భర్త కారణంగా కోరికల్ని చంపుకొని కొందరు మహిళలు బతుకుతారని.. అలాంటి వారి గురించి సమాజం ఎలా మాట్లాడుకుంటుందన్న విషయాన్ని ఇందులో నీట్ గా ప్రజెంట్ చేశారన్నారు.
మంచి మెసేజ్ ఉన్న సిరీస్.. మంచి ప్రొడక్షన్ హౌస్ కావటంతో తాను ఆ పాత్రను చేయటానికి ఒప్పుకున్నట్లుగా చెప్పారు. తన రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్టు అవుతారని..తన పాత్ర కావాలని తప్పు చేయదని.. వీక్ మూమెంట్ లో తప్పు జరిగిపోతుందన్నారు. ‘ఆ తప్పు తనకు నచ్చింది కాబట్టి ఒప్పుకుంది. నన్ను చూసి ఇన్ స్పైర్ అవుతారని ఆ రోల్ చేశా. భవిష్యత్తులో ఇలాంటి స్టఫ్ ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా’ అంటూ చేసిన ఆమె మాటలు ఇప్పుడు కంగుతినేలా చేస్తున్నాయి.
ఇప్పటికే వివాహేతర సంబంధాలతో క్రైం రేట్ ఎంతలా పెరుగుతుందో తెలిసిందే. అలాంటి వేళ.. ఇలా మాట్లాడటం అన్నదా? ప్రశ్నగా మారింది. దీనికంటే.. నచ్చని భర్తతో కలిసి ఉండే కన్నా.. చట్టప్రకారం విడాకులు తీసుకొని ఇంకొకరితో జీవితం లాంటివి బెటర్ కానీ.. వీక్ మూమెంట్ లో మరొకరికి దగ్గరయ్యే రొమాంటిక్ పాత్రను చూసి ఏం ఇన్ స్పైర్ కావాలన్నది ప్రశ్న. ఇక… సనాతో స్క్రీన్ రొమాన్సు చేసింది మరెవరో కాదు.. బిగ్ బాస్ ఫేం అలీ రేజా. మొత్తానికి ఇంటిమేట్ సీన్లతో సనా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారని చెప్పక తప్పదు.